Home / Entertainment / ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ‘జ్యో అచ్యుతానంద’

ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ‘జ్యో అచ్యుతానంద’

Author:

నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా రెజీనా హీరోయిన్ గా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జ్యో అచ్యుతానంద. ఈ రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఆడియో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి సినిమా స్థాయి ఇంకా పెరిగంది. ఈ ట్రైలర్ లో అచ్యుత్ గా నారా రోహిత్‌, ఆనంద్‌గా నాగ‌శౌర్య‌, జ్యో గా రెజీనా ల  మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. ఈ సినిమా వచ్చే నెల(సెప్టెంబ‌ర్)9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

jyo-achyutananda-movie-released
ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ….. ఈ సినిమా భాగా రావడానికి అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఒక ముగ్గురు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగే సున్నిత‌మైన క‌థాంశంతో దానికి కొద్దిగా ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ క‌లిపి ఈ చిత్రాన్ని తీశాను. నా మొదటి చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రం కంటే చాలా బాగా వచ్చింది.  ఒక మంచి సినిమా రావడానికి కారణం సినిమా అంటే ఒక ఫ్యాషన్ ఉన్న టీం దొరకడం. కానీ లక్కీగా అలా నాకు ఒక మంచి టీం దొరికింది అందుకే ఒక మంచి సినిమా మీ ముందుకు వస్తుంది అన్నారు.

(Visited 49 times, 1 visits today)