Home / Entertainment / జ్యో అచ్యుతానంద సినిమా రివ్యూ & రేటింగ్.

జ్యో అచ్యుతానంద సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

jyo-achyutananda-movie-perfect-review-rating

నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టి ఊహలు గుసగుసలాడే లాంటి ఒక మంచి లవ్ స్టోరీతో దర్శకుడిగా తన తోలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు అవసరాల శ్రీనివాస్. ఈ సినిమా తరవాత చాలా గ్యాప్ తీసుకోని మళ్ళీ ఇప్పుడు జ్యో అచ్యుతానంద అంటూ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్ , నాగశౌర్య, రెజీనా నటించారు. ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఒక అమ్మాయి వస్తే ఏవిధంగా ఉంటుందో అదే మా సినిమా అంటున్నాడు శ్రీను…. మరి ఒక్కసారి చూద్దాం ఈ సినిమా ఎలా ఉందొ !.

కథ :

అచ్యుత రామారావు (నారా రోహిత్).. ఆనందవర్ధన్ రావు (నాగశౌర్య) అన్నదమ్ములు. ఒకరంటే ఒకరికి పడదు. ఇక వీళ్లింటి పై పోర్షన్ లోకి జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దె దిగుతుంది, ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రేమిస్తారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తారు, కాని జ్యోత్స్న ఇద్దరిని కాదనుకొని విదేశాలకు వెల్తుంది. అచ్యుత్‌, ఆనంద్‌లు లు వివాహాలు చేసుకున్నాక తిరిగొచ్చిన జ్యోత్స్న ఇద్దరిని ప్రేమిస్తున్నానని చెబుతుంది. జ్యోత్స్న పెళ్ళి అయిన అచ్యుత్‌, ఆనంద్‌లను ఎందుకు ప్రేమిస్తుంది, దానికి గల కారణాలు దానిపై వారి స్పందన మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ :

ఎప్పుడైనా ఒక ప్యామిలీ కథను ఎంచుకున్నాం అంటే దానిని చాలా జాగ్రత్తగా చిత్రీకరించాలి. ఫ్యామిలీ డ్రామాలో ఏ ఒక్కటి తక్కువైనా మొదటికే మోసం వస్తుంది. కథ మామూలు  అయినా దానిని చూపించిన విధానం చాలా కొత్తగా ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఈ సినిమాలో అచ్యుత్ గా నారా రోహిత్ నటన చాలా బాగుంది. సోలో తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు అనే చెప్పాలి. మరో హీరోగా నటించిన నాగ శౌర్య చాలా బాగా నటించాడు. ఈ మధ్య శౌర్య సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఈ సినిమాలో తన నటన తో ఆ లోటును తీరుస్తాడు. ఇక అన్నదమ్ములుగా వీరి కెమిస్ట్రీ చాలా బాగుంది. కామెడీ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా  ఫర్ఫెక్ట్ గా చేశారు ఇద్దరు. జ్యో గా రెజీనా నటన చాలా అద్భుతం అని చెప్పాలి. ఇప్పటి వరకు నటించిన చిత్రాలలో మొదటి రెండు స్థానాలలో ఈ సినిమా ఉంటుంది. రెజీనా తన క్యూట్ నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది ఈ సినిమాలో.

నాని గెస్ట్ రోల్ చాలా కీలకమైన సమయంలో ఉండటం అలాగే తాను కూడా పాత్ర మేరకు నటించగలడం చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ లో సినిమా చూస్తూనే ఉండిపోతాం. ఎందుకంటే అమ్మాయిని పడేసే సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఎత్తుకు పై ఎత్తులు చాలా కామెడీగా ఉంటాయి. రెజీనా కూడా ఇద్దరి లవ్ ని ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. అందరికి విషయం తెలిసిపోయి చాలా స్లో అయిపోతుంది. ఇక ఫ్రీ క్లైమాక్స్ లో సినిమా మంచి పట్టులో ఉండగా నాని ఎంటర్ అవడం సినిమాను సెకండ్ ఆఫ్ లో మంచి ఊపు ఇచ్చే సన్నివేశం. ఇక క్లైమాక్స్ లో మాత్రం అందరి కళ్ల నుండి నీరు రావడం జరుగుతుంది.అంతలా అత్తుకుపోయే సన్నివేశంతో తీసాడు దర్శకుడు.

సాంకేతిక వర్గం పనితీరు:

ముందుగా చెప్పుకోవలసింది అవసరాల శ్రీనివాస్ గురించే ఎందుకంటే తనదైన కథ, కథనం మరియు టేకింగ్ తో అందరిని మెస్మరైజ్ చేసాడు. టేకింగ్ కూడా పాత్రలు అక్కడ కనిపించాయి కానీ హీరోలు కనిపించలేదు అంటే ఎంత బాగా తీసాడో అర్ధం చేసుకోవచ్చు.

ఇక సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. ఈ సినిమా బడ్జెట్ లో అంత బాగా విజువల్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ మధ్య సమన్వయము చాలా అద్భుతంగా ఉంటేకానీ దర్శకుడు చెప్పింది తన కెమెరాలో బంధించాలేఢు కెమెరామెన్. కల్యాణి మాలిక్ పాటలు కొన్ని చెప్పుకోదగినవి గా ఉన్నాయి. కిరణ్ ఎడిటింగ్ సెకండ్ ఆఫ్ లో కొద్దిగా కట్టింగ్ ఉంటే బాగుండు.

ప్లస్ పాయింట్స్ :

  • కథ
  • కథనం
  • ఇద్దరు హీరోలు
  • కామెడీ
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • సెకండ్ ఆఫ్ స్లో ఉండటం

అలజడి రేటింగ్: 3.25/5

పంచ్ లైన్ : జ్యో అచ్యుతానంద..! మనసుని హత్తుకుంటుంది నెమ్మదిగా..!!!

(Visited 2,184 times, 1 visits today)