Home / Entertainment / ఆప్తులకు అవార్డు రావడం ఆనందం : చిరంజీవి

ఆప్తులకు అవార్డు రావడం ఆనందం : చిరంజీవి

Author:

Raghavender rao got allu ramalingaiah award

సత్యసాయి నిగమాగమంలో అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కార అవార్డు ప్రధానం కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారంతో సత్కరించారు. హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, అశ్వినీదత్, అల్లు అర్జున్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస్‌రావు, కామినేని శ్రీనివాస్‌రావు, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నిర్మాత శరత్ మరాత్, అల్లు శిరీష్‌లు హాజరైయ్యారు. మెగాస్టార్ చిరంజీవి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.

చిరంజీవి మాట్లాడుతూ… ‘దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో నాకు మూడున్నర దశాబ్దాల అనుబంధం ఉంది. మాది విడదీయరాని అనుబంధం. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. అల్లు రామలింగయ్యకు ఎంతో ఆప్తుడైన రాఘవేంద్రరావుకు ఈ అవార్డు ఇవ్వడం ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. దర్శకేంద్రుడు ఈ అవార్డుకు మరింత వన్నె తెచ్చారన్నారు. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది’ దర్శకేంద్రుడు ఈ అవార్డుకు మరింత వన్నె తెచ్చారన్నారు. ‘అడవిదొంగ సినిమాతో రాఘవేంద్రరావు నన్ను మాస్ హీరోగా చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేయడంతోపాటు ఇండస్ట్రీలో నా సత్తా పెంచారు. ఆయనతో 12 సినిమాలు చేసిన ఘనత ఎన్‌టీఆర్‌కు, నాకు దక్కింది. ఆయన కంటే చిన్నవాడిని అయినా నన్ను బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. అల్లుగారు హాస్యనటుడిగా అందరికీ తెలుసు. . అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారమిక్కడ ‘సాంస్కృతిక బంధు’ సారపల్లి కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ‘అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం 2015’ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిరంజీవి ఆయనకు స్వర్ణకంకణం, స్వర్ణ కిరీటంతో పాటు పురస్కారాన్ని అందించారు.

(Visited 39 times, 1 visits today)