Home / Inspiring Stories / 104 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడికి అనారోగ్యం అంటే ఏంటో తెలియదు.

104 ఏళ్ల వయసు ఉన్న ఈ యువకుడికి అనారోగ్యం అంటే ఏంటో తెలియదు.

Author:

Kaanuboyina Ramananiah

104 ఏళ్లు ఉన్న ఒక మనిషి ఎలా ఉంటాడు. ఒక వేళ ఉంటే మాత్రం మంచం పై ఉండి కృష్ణ, రామ అంటు మనసులోనే అనుకుంటు మాట్లాడలేని స్థితిలో ఉంటారు కద! ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 30 సంవత్సరాలకే ముసలి వయసు వచ్చేస్తుంది కొందరికి. 40 ఏండ్లు వచ్చేసరికి కీళ్ల నొప్పులు,కంటి చూపు సరిగ కనిపించకపోవడం, 50 ఏండ్లకే కాటికి కాలు సాపుతున్న ఈ స్పీడ్ యుగంలో 104 ఏండ్లు ఉన్న కోడి కూతతో నిద్రలేచి ఇప్పటికి చక్కగా తన పనులు తానే చేసుకుంటాడు, ఎంత దూరం అయిన నడుస్తాడు.ఎలాంటి మతిమరుపు లేకుండ, మాట నత్తిపోకుండ, కంటి చూపు ఏమాత్రం ఇబ్బంది లేకుండ ఇప్పటికి యువకులకు ఉన్నంత ఉత్సహంతో తను చూసిన ఆ కాలం నాటి విషయాలు అలాగే తన ఆరోగ్య విషయాలు మనకు ఒక వారదిలా అప్పటి సంగతులు ఇప్పుడున్న మనకు తెలియజేస్తున్నడు మీ కోసం కానుబోయిన రమణయ్య.

కానుబోయిన రమణయ్యకు ఇప్పుడు 104 ఏండ్లు కద! మరి నువ్వు ఎప్పుడు పుట్టావు అని అడిగితే తడబడకుండ ‘1911 జూలై ఏడో తేదీ’ అని టక్కున సమాధానం చెప్పేస్తాడు. రమణయ్య ఉండేది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని జంగాలవీధి. ఇంక తన గురించి చెబుతూ…. “తను యువకుడిగా ఉన్నప్పుడు అంగ్లేయుల పాలనలో దేవాదాయ శాఖ గుమాస్తాగా పనిచేశాను. ఇరవై రెండు గ్రామాలలో దేవాలయ భూముల్లో సాగు చేసిన రైతుల నుంచి శిస్తు వసూలు చేసేవాడిని, శిస్తు వసూలు కోసం చెరువు గట్ల మీద, పొలాల గట్ల మీద ఊరు, వాడ తిరిగి వసూలు చేసి పన్ను అధికారులకు కట్టేవాళ్లం. ఒకప్పుడు ఎంత దూరం పోవలాన్న నడిచే పోయేవారు. భాగా డబ్బూన్నవారు మంతులు మాత్రం గుర్రపు బండ్లు, ఒంటెద్దు బండ్లు, పెద్దోళ్లకు మాత్రమే ఉండేవి. ఆ తరువాతనే ఎద్దుల బండ్లు, నెమ్మదిగా బస్సులు కూడా వచ్చాయి అంటాడు. నేను రోజు శిస్తు కోసం ఏదో ఒక ఊరు తిరుగుతుండేవాడిని అలా తిరగడం వలనే కావోచ్చు ఇంక నాకు ఎలాంటి ఆనారోగ్య సమస్యలు రాలేదు అనుకూంటా!”

ఇంకా తన బాల్యం గురించి చెబుతూ… “నా చిన్నతనంలో ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు, రాగులు, సజ్జలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత చాలా రోజులకు ఎర్ర బియ్యం వచ్చాయి. అప్పట్లో ఎవరైన పని చేస్తే అంత వస్తు మార్పిడి ఉండేది డబ్బులు ఇచ్చేవారు కాదు. ఎవరికైన ఎదైన అవసరం ఉంటే అందరు ఆదుకునేవారు. కాఫీలు, టీలు లేవు. సొంటి కాఫీ కూడా తర్వాతెప్పుడో వచ్చింది. పెద్దోళ్లు,గొప్పోళ్లు తప్ప ఎవరూ బంగారం కొనేవాళ్లు కాదు. ఇక నా కళ్ళతో గాందిగారిని చూసిన అప్పుడు నాకు 10 ఏండ్లు అంటే 1921లో మా పల్లెపాడుకు గాంధీజీ వచ్చారు.ఆ రోజుల్లో గాంధీని చూస్తుంటే ఓ దైవదూతను చూసినట్లే అనిపించింది. ఆ రోజుల్లో ఏదైన శుభకార్యం జరుగుతుందంటే చాలా భయపడిపోయేవారం. ఎందుకంటే శుభకార్యం కానీ పెండ్లి కానీ చేసుకునేవారు ముందుగానే వచ్చేవారికి బియ్యం తీసుకునీ రావలని చెప్పేవారు. అప్పుడు బియ్యం అంటే చాలా ఖరీదు. 1921లో వచ్చిన గాలివాన నా జీవితంలో మరచిపోలేని సంఘటన. గాలివాన బీభత్సానికి దాదాపు 800 మందికిపైగా చనిపోయారు.అంత మంది శవాలని తీయలేక అలానే వదిలేస్తే కలరా వచ్చి దాపు చాలా మంది 600 మంది చనిపోయారు.

ఎన్ని కులాలు ఉన్నా.. అందరం కలిసుండేవాళ్లం. ఎవరికి ఏ అవసరం వచ్చినా అందరూ ముందుకొచ్చేవాళ్లు. అధికారులంటే ఒక భయం ఉండేది. అప్పుడు పోలీసులు, ఉద్యోగులు, మాలాంటి గుమాస్తాలు అందరూ ఖాకీ నిక్కర్లు మాత్రమే వేసుకోవాలి. నాకు అదే అలావాటైంది. ఇప్పటికీ ఖాకీ నిక్కర్లే వేసుకుంటా. మా ఇంట్లో శుభకార్యాలకూ నా డ్రెస్‌ ఇదే. అప్పుటి విషయాలన్ని పెద్ద పుస్తకం రాయాలని కోరిక. నాకేమో అంతగా చదువు రాదు. ఈ విషయాలన్నీ నాతో పాటే కాలంలో కలిసిపోతాయి” అంటు తన తీపి గుర్తులను గుర్తుకు చేస్తు మనకు కొన్ని మంచి విషయాలు తెలిపాడు.

(Visited 2,109 times, 1 visits today)