Home / Entertainment / ‘కపాలి’ గురుంచి రజనీకాంత్ రంజిత్ కి ఎం చెప్పాడు ?

‘కపాలి’ గురుంచి రజనీకాంత్ రంజిత్ కి ఎం చెప్పాడు ?

Author:

తెలుగు వెండి తెర మీద రజనీకాంత్ కొత్త రోల్ లో మరో సారి కనపడబోతున్నారా? కొచ్చిదియాన్, లింగ సినిమాలు ఆర్ధికంగా దెబ్బ కొట్టడంతో కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న రజనీకాంత్ కొత్త సినిమా `కపాలి’ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నట్టు తమిళ సినిమా పరిశ్రమ లో చెప్పుకుంటున్నారు. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వం లో రూపు దిద్దుకోబోతున్న `కపాలి’ వచ్చే నెలలో సెట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కపాలి పేరిట సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్న వీడియోలన్నీ కూడా ఫ్యాన్ మేడ్ మాత్రమేనని సినీ సీనియర్లు చెపుతున్నారు. ఇంతవరకూ కపాలి లోగో రిలీజ్ కాకపోయినా, రజనీ ఫ్యాన్స్ చేస్తున్న ఈ హడావుడి చూస్తుంటే, కచ్చితంగా కపాలి సూపర్ డూపర్ హిట్ కాబోతోందునే వాతావరణం ఏర్పడింది.

రజనీకాంత్ కుమార్తె సౌందర్య కనుసన్నల్లో రూపు దిద్దుకున్న కొచ్చిడియాన్ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టడం, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ భారీగా నష్ట పోవడం, దాని తర్వాత లింగ సినిమా కూడా రజనీ ని తీవ్ర స్థాయిలో నిరాశ పర్చడంతో… కొన్నాళ్ళ పాటు ఆయన విరామం ప్రకటించారని పరిశ్రమ అంతా చెవులు కోరుక్కుంది. అయితే….తాజాగా యువ దర్శకుడు రంజిత్ ను రజనీ ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనుక ఉన్నది ఎవరు? …ఇవన్నీ ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. వాస్తవంగా `డాన్’ కథాంశంగా ఉన్న ఈ స్టోరీ ని దర్శకుడు రంజిత్ ముందస్తుగా హీరో సూర్య కు వివరిస్తే, ఆ పాత్ర డిమాండ్ చేసే వయసు తనకు లేదనీ, ఇది రజనీ సార్ కు సూట్ అయ్యే రోల్ అనీ చెప్పి మరీ-సూర్య ఆ దర్శకుడిని రజనీకాంత్ దగ్గరకు తానే స్వయంగా తీసుకెళ్లాడట! ముందు కేవలం పది నిమిషాలు మాత్రమే ఇస్తానని చెప్పిన రజనీకాంత్, దాదాపు మూడుగంటల పాటు రంజిత్ చెప్పిన కథ విని, తానే స్వయంగా ఆ సినిమా చేస్తానని చెప్పారట!

రజనీ తలచుకుంటే నిర్మాతలకు కొదవ లేదు..కానీ అది ఒకప్పటి మాట! కొచ్చిడియాన్, లింగ సినిమాల దెబ్బకు పెద్ద నిర్మాతలందరూ ఆజ్ఞాత వాసం చేస్తుండటం, రజనీకాంత్ కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉండటం వంటి కారణాల వల్ల—-అసలు అంత ధైర్యంగా ఏ నిర్మాత ముందుకు వస్తాడు అని అనుకునే తరుణంలో— రజనీకాంత్ సారే స్వయంగా తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి థాను కు ఫోన్ చేసి—దర్శకుడు రంజిత్ ను అతని దగ్గరికి పంపిస్తున్నాననీ, ఆ సినిమాకు నీవే నిర్మాతవనీ చెప్పేశారుట! ఇహ, ఆయన చెపితే కాదనే పరిస్థితి ఏముంది? తక్షణం –దానికి సంబంధించిన స్టోరీ బోర్డ్ తయారు చేసే పనిలో పడాల్సిందిగా దర్శకుడు రంజిత్ కు నిర్మాత కలైపులి థాను చెప్పారట!

 

రజనీకాంత్ కష్టాల నుంచి బయటపడతారా

 

రంజిత్ కేవలం రెండే రెండు చిత్రాలు—కార్తీక్ హీరోగా మద్రాస్, పూర్తిగా కొత్తవాళ్లతో తీసిన ‘అట్ట కత్తి’ లకు దర్శకత్వం వహించాడు. ఆ రెండూ కూడా హిట్ అవ్వడంతో, రంజిత్ కు ఈ అవకాశం వచ్చింది. వాస్తవంగా దానికన్నా ముందే—లారెన్స్ లేదా ప్రభుదేవాలలో ఒకరు రజనీకాంత్ కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం నడిచింది. కానీ, వాటన్నింటినీ కొట్టి పారేస్తూ…రంజిత్ ఆ అవకాశం చేజిక్కించుకున్నాడు. ఈ కపాలి సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్ ఛాన్స్ కొట్టేస్తే, రజనీకాంత్ కుమార్తె రోల్ కు ధన్సిక ఎంపికనత్తు సమాచారం. సో…ఆల్ ద బెస్ట్ రజనీకాంత్ …తెలుగు ప్రేక్షకులు కూడా మిమ్మల్ని `కపాలి’ లో డాన్ రోల్ లో చూడటానికి ఉవ్విళ్లూరుతున్నారు.

(Visited 123 times, 1 visits today)