Home / Entertainment / ‘కబాలి’కి ఖరారైన ఇంటర్నేషనల్ విలన్స్

‘కబాలి’కి ఖరారైన ఇంటర్నేషనల్ విలన్స్

Author:

Kabali Movie Villains

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అలియాస్ తలైవా రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న సినిమా ‘కబాలి’. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫైనల్ షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా ఓ చేజింగ్ ఎపిసోడ్ మరియు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా రజినీకాంత్ పై షూట్ చేయనున్నారు. అదలా ఉంచితే.. ఈ సినిమాలో రజినీకాంత్ కి పోటీ ఇచ్చే విలన్ గా జెట్ లీ కనిపిస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ జెట్ లీ చేయడం లేదని ఈ చిత్ర డైరెక్టర్ పిఎ రంజిత్ తెలియజేశాడు.

రజినీకాంత్ కోసం ఇంటర్నేషనల్ స్టార్స్ నే విలన్ పాత్రలకోసం ఎంచుకున్నారు. మెయిన్ విలన్స్ గా ఇద్దరు కనిపించాలి. వారి కోసం తైవాన్ యాక్టర్ అయిన విన్స్టన్ చవో మరియు మలేషియన్ యాక్టర్ రోస్యం నోర్ ని సెలక్ట్ చేసారు. వీరిద్దరూ కూడా ఈ ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. మామూలుగానే రజినీకాంత్ సినిమాలకు చైనా, జపాన్, మలేషియాలలో మంచి క్రేజ్ ఉంది. అలాంటి రజినీ సినిమాలో ఇప్పుడు మలేషియన్ స్టార్స్ కూడా తోడవడంతో ఈ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా భారీగానే రిలీజ్ అవుతుందని ఆశించవచ్చు.

(Visited 94 times, 1 visits today)