Home / Inspiring Stories / ఏసిబికి పట్టుబడిన ఆవినీతి తిమింగలం,800కోట్లకి పైగా అక్రమ ఆస్తులు.

ఏసిబికి పట్టుబడిన ఆవినీతి తిమింగలం,800కోట్లకి పైగా అక్రమ ఆస్తులు.

Author:

DTC Mohan Kakinada 1

ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖకు చెందిన డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌(డిటిసి) నివాసాలపై ఏసీబీ నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు బైటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎ.మోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.ఈ అక్రమ అధికారి ట్రాన్స్‌పోర్ట్‌ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసేవారు, అరెస్ట్ చేసిన పిమ్మట మరుసటి రోజు సాయంత్రం కోర్ట్ లో ప్రవేశపెట్టగా కోర్టు ఆయనకు రెండు వారాల రిమాండ్‌ విధించింది. ఒకే సారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలలో తొమ్మిది ప్రదేశాల్లో ఆవాసాలు ఏర్పరుచుకున్న ఈ అవినీతి అధికారి పై ఏసీబీ ఈ దాడులు నిర్వహించింది. అక్రమంగా దొరికిన ఆస్తుల మొత్తం విలువ రూ. 800 కోట్లు పైగానే ఉందని ఏసీబీ వారు తెలియచేసారు .

DTC Mohan Kakinada 1

ఈ దాడులు గురువారం నాడు ఏసీబీ డీఎస్‌పీ రమాదేవి నేతృత్వం నిర్వహించారు ,లభించిన ఆధారాలు పత్రాలు ప్రకారం మోహన్ ఆస్తి ఓ 100 కోట్ల వరకూ ఉన్నాయి ,బ్లాక్ మనీ ని వైట్ మనీ చేసేందుకు కూతురు పేరిట బోగస్ కంపెనీలు ఓపెన్ చేసి మరో కేసులో కూడా ఇరుక్కున్నారని ,అసలు అ కంపెనీలకి పునాదులు కూడా లేవని చెప్పారు .అయితే మోహన్‌కు చెందిన 12 బ్యాంకు లాకర్లను ఇంకా తెరవలేదు.కర్నాటకలోని బళ్లారిలో కూడా కొన్ని ఆస్తులను అత్తా మామల పేరిట మార్చారని ,ఇంకా బెంగళూరులో భారీగా ఆస్తులను,రాజధానికి దగ్గరలో పిల్లల పేరు మీద విలాస భవనాలను గుర్తించమని అధికారి రమాదేవి చెప్పుకొచ్చారు.

DTC Mohan Kakinada 1

ఎసిబి వారిని మొదట ప్రేవేశించకుండా అడ్డుకుంటానికి ప్రయత్నించాడని ,ఆ తర్వాత ఫోన్ ని కూడా దూరంగా కనపడకుండా విసిరి కొట్టారని .తర్వాత సోదాలలో ఫోన్ దొరకగా ,లభించిన ఆస్తుల ప్రకారం బందువులు మరియు కొద్ది మంది మిత్రుల దగ్గర విలువైన బంగారం ,వజ్రాలు ,రత్నాలు దాచి ఉంచా రానీ వెల్లడించారు,ఈ దాడులలో రమాదేవితో పాటు ముగ్గురు డీఎస్‌పీలు, 9 మంది ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, దాదాపు 30 మంది సిబ్బంది పాల్గొని విజయవాడ బెల్లారి, మెదక్‌, నెల్లూరు, ప్రకాశం,అనంతపురం, కడప జరిగాయని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేసారు.

DTC Mohan Kakinada 1

ఈ అవినీతి అధికారి అరెస్టు పట్ల పలువురు కింద పనిచేసే ఉద్యోగులు ,ఇతరేతర వాహన యజమానులు ఇతని ఆగడాల గురించి చెప్తూ హర్షం వ్యక్తం చేసేవారు ,ప్రమోషన్ కోసం లంచాలు ఇవ్వమని కింది ఉద్యోగులని కూడా వేదించే వాడు ,ఈ విషయాలు పై గతంలో కూడా ఓ సారి స్థానిక ఎం. ఎల్. ఎ ఒకటి రెండు సార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది ,ఇతగాడి వైఖరిలో ఏ మార్పూ కనపడలేదు, గ్రూప్‌-1లో ఉత్తీర్ణులయి మోహన్ 1989లో ఆర్‌టీఓగా నియమితులయ్యారు. అప్పటి నుండీ ఇలా మొదలు పెట్టి చివరికి 800 కోట్లు మింగేసాడు

(Visited 1,373 times, 1 visits today)