Home / Videos / ఆకట్టుకుంటున్న ‘కళ్యాణవైభోగమే’ ట్రైలర్

ఆకట్టుకుంటున్న ‘కళ్యాణవైభోగమే’ ట్రైలర్

Author:

kalyanaViabhogame

‘అలా మొదలయింది’ చిత్రంతో సినీరంగ ప్రయాణాన్ని విజయవంతంగా మొదలుపెట్టిన దర్శకురాలు నందినిరెడ్డి తాజాగా దర్శకత్వం వహించిన ‘కళ్యాణవైభోగమే’ చిత్రం ఆడియో నిన్న అట్టహాసంగా విడుదలయింది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన 3వ సినిమా ‘కళ్యాణ వైభోగమే’. యంగ్ హీరో నాగ శౌర్య, మలయాళ భామ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి కోడూరి మ్యూజిక్ అందించాడు.

ఈ ట్రైలర్ లో లవ్ అనే పదం పక్కన మ్యారేజ్ అనే శాపం దూరింద అక్కడే నీ దరిద్రం స్టాట్ అవుతుంది అనే డైలాగ్ తో మోదలై నాకీ పెండ్లి ఇస్టం లేదు డైలాగ్ తో ముగుస్తుంది… ఈ ట్రైలర్ లో పెళ్లి అంటే నమ్మకం లేని, ఇష్టం లేని వారి మధ్య ప్రేమ పెళ్లి అనేది ఎలా జరిగిందనే పాయింట్ ని చూపించారు. ఈ సినిమాలో నేటితరం యువత పెళ్లి అనే దానిపై ఎలాంటి ఆలోచనలో ఉన్నారు అనే పాయింట్ ని చూపించారు. ఆ పాయింట్ అందరికీ నచ్చడంతో పాటు, ట్రైలర్ కూడా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండడంతో అందరినీ ఆకట్టుకుంటోంది.నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన మూడు సినిమాలు గమనిస్తే పెళ్ళే కథలో కీలకం కావటం చూడొచ్చు. మొత్తానికి నందిని రెడ్డి తాను పెళ్ళి చేసుకోకపోయినా పెళ్ళి సబ్జెక్టు మీద వరసపెట్టి సినిమాలు చేస్తుండటం విచిత్రంగా ఉంది! ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని కూడా జనవరి చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

(Visited 163 times, 1 visits today)