Home / Entertainment / ‘కళ్యాణ వైభోగమే’ కలర్‌ఫుల్.

‘కళ్యాణ వైభోగమే’ కలర్‌ఫుల్.

Author:

Naga Shaurya Kalyana Vaibhogame First Look

నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా దర్శకురాలు నందిని రెడ్డి ‘కళ్యాణ మేవైభోగ’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ‘కళ్యాణ మేవైభోగ’ అన్న పద ప్రయోగం వినగానే తెలుగులోనూ అందరినోళ్ళలోనూ, అన్ని పెళ్ళిల్లలోనూ మోగిన కళ్యాణ వైభోగమే అన్న పాట గుర్తుకువస్తుంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ ఉదయం దీపావళి కానుకగా కళ్యాణ వైభోగమే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇక నేడు విడుదలైన పోస్టర్‌తో నందిని రెడ్డి మళ్ళీ తనదైన మార్క్ సినిమాతో అలరించేందుకు సిద్ధం అయ్యారన్న విషయం స్పష్టమవుతోంది. అలా మొదలైందితో అందరి దృష్టినీ ఆకర్షించిన నందిని, ఆ తర్వాత వచ్చిన జబర్దస్త్‌తో పరాజయాన్ని చవిచూశారు.ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్, పోస్టర్స్ ఏవీ విడుదల కాకపోవడంతో సినిమా ఎలాంటి ఫ్లేవర్‌లో ఉండనుందనే విషయంపై ఆసక్తి కంటిన్యూ అవుతూ వచ్చింది. దీంతో కళ్యాణ వైభోగమే విషయంలో నందిని రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.

ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తే.. ఇక గతంలో హీరోయిన్లుగా మెప్పించిన రాశి, ఐశ్వర్యలు ఈ సినిమాలో కీలక పాత్రలు చేయనుండడం విశేషంగా కనిపిస్తోంది. హీరో నాగశౌర్య, మాళవిక నాయర్‌ల పెయిర్ ఎంత అందంగా ఉండనుందనేది తెలుస్తూనే ఉంది. పోస్టర్ అంతా సినిమా మూడ్‌ను తెలియజేస్తూ కలర్‍ఫుల్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. రంజిత్ మూవీస్ పతాకంపై దామోదర ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూర్చారు. డిసెంబర్ నెల్లోనే ఆడియో, సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

(Visited 58 times, 1 visits today)