Home / Entertainment / ఈ రోజు సాయంత్రం నందిని రెడ్డి ‘కళ్యాణ వైభోగమే’ పాటలు విడుదల.

ఈ రోజు సాయంత్రం నందిని రెడ్డి ‘కళ్యాణ వైభోగమే’ పాటలు విడుదల.

Author:

Kalyana Vaibhogame Movie Poster

‘అలా మొదలైంది’ లాంటి సూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీతో తెలుగు పరిశ్రమను తన వైపుకు తిప్పుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. లేడీ డైరెక్టర్స్ ఎప్పుడో గానీ కనిపించని ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ చేసిన రెండో సినిమా ‘జబర్దస్త్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో గ్యాప్ తీసుకొని మరో పర్ఫెక్ట్ కథను సిద్దం చేసుకున్న నందిని రెడ్డి యువహీరో నాగశౌర్యతో తన మూడవ సినిమా ‘కళ్యాణ వైభోగమే’. మలయాళ భామ మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి కోడూరి మ్యూజిక్ అందించాడు. తను చేసిన రెండు సినిమాలు వివాహం గురించి తప్పకుండ ఉన్నాయి మూడవ సినిమా కూడా నేటితరం వివాహ సంబంధాలు ఎలా ఉన్నాయి అనే కాన్సెప్ట్ ని డీల్ చేస్తోంది. అయితె ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ వర్క్స్ చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్ర టీం సినిమా ఆడియో రిలీజ్ మరియు రిలీజ్ లకు సిద్దం చేసుకుంటోంది.

నందిని రెడ్డి ‘కళ్యాణ వైభోగమే’ సినిమా ఆడియో లాంచ్ జనవరి 2వ తేదీన హైదరాబాద్ లోని హోటల్ దసపెల్లలో గ్రాండ్ గా జరగనుంది. అలాగే సినిమాని కూడా జనవరి చివరి వారంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ద్వారా ఇదొక ప్యూర్ రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలియజేశారు.

(Visited 301 times, 1 visits today)