Home / Entertainment / కమల్ భార్యగా రమ్యకృష్ణ!.. కూతురిగా శృతి హసన్.

కమల్ భార్యగా రమ్యకృష్ణ!.. కూతురిగా శృతి హసన్.

Author:

Sruthi-hasan-Ramya-Krishna

నిరంతర నట తపస్వి, విలక్షణ నటుడు, ఆయనలోని నటనార్తి తీర్చుకోవడానికి చాలా వైవిధ్యమైన పాత్రలను పోషించినవాడు కమల్ హసన్. కమల్ హసన్ ఈ వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీపడుతూ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇటీవల విడుదలైన ‘చీకటి రాజ్యం’ చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత కమల్ హసన్ హీరోగా ‘అమ్మ నాన్న ఆట’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో అక్కినేని అమల నటిస్తుండగా, హీరోయిన్ జరీనా వాహిబ్ అనే కొత్త హీరోయిన్ వెండితెరకి పరిచయమవుతుంది.

‘అమ్మ నాన్న ఆట’ సినిమా తర్వాత కమల్ హసన్ మరోసారి రాజీవ్ దర్శకత్వంలోనే మరొక చిత్రంలో నటించబోతున్నాడు. త్వరలో తెరకేక్కబోతున్న ఆ చిత్రంలో కమల్ హసన్ కి భార్యగా రమ్యకృష్ణ నటిస్తుండగా, కూతురిగా శృతిహసన్ కనిపించబోతుంది. ఇప్పటికే రమ్యకృష్ణ కూడా ఈ కథ విషయంలో సానుకూలంగా ఉన్న రమ్యకృష్ణ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

(Visited 137 times, 1 visits today)