Home / Entertainment / జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి …. ఉత్తమ స్థానిక భాషా చిత్రంగా కంచె

జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి …. ఉత్తమ స్థానిక భాషా చిత్రంగా కంచె

Author:

baahubali-english poster

63 జాతీయ చలన చిత్రం అవార్డులను ప్రకటించారు. అందులో జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి ఎంపికైంది. రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటూ వెళ్తున్న బాహుబలి సినిమా సిగలో మరో అరుదైన గౌరవం చేరింది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. దీంతోపాటు జాతీయస్థాయిలో ఉత్తమ స్పెషల్ ఎఫెక్టుల అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికై, తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇంతకుముందు జాతీయ స్థాయిలో శంకరాభరణం సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు రావడం ఇదే ప్రథమం. అంతే కాదు ఉత్తమ స్థానిక చిత్రంగా క్రిష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన కంచె కూ అవార్డు దక్కింది.

       2015 సంవత్సరానికిగాను 63వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటించారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం..ఈ క్రింద అవార్డులు ఇప్పటికి ప్రకటించారు.దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి అద్భుత దృశ్య కావ్యంగా మలిచిన ఈ సినిమా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. 600 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టడంతోపాటు జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికై తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను చిరస్థాయిలో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రాజమౌళి బాహుబలికి సీక్వెల్‌ను తెరకెక్కిండంలో నిమగ్నమై ఉన్నారు. ఇది కూడా ఘనవిజయాన్ని సాధించి, తరువాతి ఏడాదిలో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలువాలని ఆశిద్దాం. గ‌త కొన్నేళ్లుగా జాతీయ అవార్డుల‌కు మొహం వాచిపోయిన తెలుగు సినిమాకి ఇది అత్య‌ద్భుత‌మైన ఊర‌ట‌. ఈరోజు జాతీయ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. జాతీయ ఉత్త‌మ చిత్రంగా బాహుబ‌లి నిలిస్తే.. ఉత్త‌మ న‌టుడి అవార్డును అమితాబ‌చ్చ‌న్ ఎగ‌రేసుకుపోయారు. ఉత్త‌మ న‌టిగా కంగ‌నా ర‌నౌత్ నిలిచింది. అవార్డు గ్ర‌హీత‌ల పూర్తి వివ‌రాలు మ‌రికాసేప‌ట్లో…

(Visited 153 times, 1 visits today)