Home / Reviews / కంచె సినిమా రివ్యూ & రేటింగ్ –

కంచె సినిమా రివ్యూ & రేటింగ్ –

Kanche Movie review and rating

Alajadi Rating

3.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: వరుణ్ తేజ్,ప్రగ్యా జైస్వాల్,అవసరాల శ్రీనివాస్,నికితిన్ దీర్

Directed by: క్రిష్

Produced by: రాజీవ్ రెడ్డి,సాయిబాబు

Banner: First Frame Entertainment.

Music Composed by: చిరంతన్ భట్

ఇంత వరకూ తెలుగు ప్రేక్షకుడి ఊహలోకి రాని కథాంశం థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను ఓ సరికొత్త అనుభూతితో బయటకి వచ్చేలా చేస్తోంది. ఒక ప్రేమకథ,దానికి సమస్య ఆనాటి కులవ్యవస్త భారతీయ చరిత్రలో కీలక గట్టం అయిన రెండో ప్రపంచ యుద్దం వెరసి కంచె విడుదలకు ముందు రోజు వరకూ అందరూ అనుకున్న మాటలే ఇవి. వరుణ్ తన రెండో సినిమాకే పిరియాడికల్ జోనర్ ని ఎన్నుకోవడంతో మొదట అందరూ ఆశ్చర్య పోయినప్పటికీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కంచె పై భారీ అంచనాలు నెలకొన్నాయి .వరుణ్ తేజ్ ని నటుడిగా నిలబెట్టే సినిమా ఇదే అనిపించింది ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరికీ.. మరి సినిమా విశ్లేషణ లోకి వెళితే…!

కథ:

1930 ల నాటి కథతో కంచె మొదలై 1944 వరకూ రెండు కథలుగా సాగుతుంది . ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ్) ఒక సాధారణ పల్లెటూరి యువకుడు. చదువంటే ఇష్టం దేశం మీద ప్రేమా ఉన్న మనిషి.తక్కువ కులం లోనే పుట్టినా పై చదువులు చదువుతూ మద్రాసు యూనివర్సిటీ లో చేరుతాడు. రాచకొండ సంస్థానానికి అధినేత ఈశ్వర్ ప్రసాద్(నికేతన్ ధీర్), అతని చెల్లెలు ప్రిన్సెస్ సీతాదేవి(ప్రాగ్య జైశ్వాల్)కూడా అదే యూనివర్సిటీలో చేరుతుంది. హరి బాబు ని చూసి ఇష్టపడుతుంది ఇద్దరూ
ప్రేమించుకుంటారు. కానీ వీరి పెళ్ళికి కులం అడ్డు వస్తుంది తక్కువ కులం వాడైన హరిబాబు తో సీతాదేవి పెళ్ళిని ఎవరూ ఒప్పుకోరు. అలాంటి పరిస్థితుల్లో హరిబాబు తన ప్రేమ ని గెలుచుకోవడానికి ఏం చేసాడు? అతని ప్రేమ గెలిచినట్టేనా? కంచె చిత్రానికి రెండో ప్రపంచయుద్దానికి సంబంధం ఏంటి ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అన్నది ఒక కథ  ఇక 1944కి వస్తే రాయల్ ఇండియన్ ఆర్మీ హెడ్స్ అయిన ఈశ్వర్ ప్రసాద్ – హరిబాబులు ఇటలీ తరపున పోరాడటానికి సిద్దమవుతారు. అలా వార్ ఫీల్డ్ లో ఉన్న వీరి పై శత్రు సైన్యం ధ్వంసం చేసి ఆర్మీ చీప్ మరియు కల్నల్ ని బందిస్తుంది.  వారి నుంచి తప్పించుకున్న హరిబాబు తనతో పాటు ఉన్న మరో నలుగురుతో కలిసి తమ ఆర్మీ చీఫ్ మరియు కల్నల్ ని ఎలా కాపాడాడు అన్నది మరోకథ.ఐతే రెండు కథలూ ఒకే తాటి పై నడుస్తూ అసలెక్కడా ప్రేక్షకున్ని చూపుతిప్పనివ్వవు.

అలజడి విశ్లేషణ:

ఒక్క సారి తమని తాము చెక్ చేసుకోవటాని కి మన పెద్ద హీరోలకీ నిర్మాతలకీ కంచె మంచి అవకాశం. నిన్నటివరకు తెలుగు సినిమా కథకు ఒక కంచె ఉండేది. నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, నవ్యత లేని కథ ఒకేటైపుపాత్రలు.డబుల్‌మీనింగ్ డైలాగ్‌లు ఇలా గిరిగీసుకుని ఇరుక్కుపోయింది. కొత్త సినిమా విభిన్న సినిమా అని చెప్తారేగానీ కొత్తదనమే ఉండదు! అసలు ఇప్పుడు కొత్త సినిమా అంటే ఎలా ఉండాలో కోట్లు కుమ్మరించే నిర్మాతనీ,ప్రేక్షకున్నీ ఒకసారి ఎలా సంతోష పెట్టాలో అసలు స్క్రీన్ ప్లే అనేది ఎలా ఉండాలో చెప్పే సినిమాల్లో కంచె కూడా ఖచ్చితంగా ఉంటుంది… డిఫరెంట్ కథాంశాలతో విభిన్న దర్శకుడిగా పేరు పొందిన క్రిష్ చేసిన మరో సాహసం ఈ కంచె . అయితే స్లో నెరేషన్ వల్ల కొంత అసహనానికి గురి కావడం సహజం . అలాగే స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా రాసుకొని ఉంటే ఖచ్చితంగా మరింత బాగుండేది . వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ ,డిఫరెంట్ జోనర్ కావడం ,రొమాంటిక్
యాంగిల్ కూడా ఉండటంతో తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చేలా ఉంది అనడం లో సందేహం లేదు .ఓవరాల్ గా కంచె చిత్రం సి సెంటర్ లో ఎలా పే చేస్తుందో కానీ ఏ సెంటర్ లలో మాత్రం ఖచ్చితంగా నచ్చడం ఖాయం . ఓ డిఫరెంట్ చిత్రాన్ని చూసాం అన్న ఫీలింగ్ ని కలిగించడం ఖాయం.కంచె సినిమాలో ప్రతి తరహా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవే ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు యుద్ద నేపధ్యంలో వచ్చే వార్ ఎపిసోడ్స్. వీటన్నిటినీ బాగానే మిక్స్ చేసిన క్రిష్ నేరేషన్ ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా చెప్పి ఉంటే సినిమా కమర్షియల్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యేది. ప్రస్తుతానికి బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకున్నా ప్రతి ఒక్కరి హృదయాల్ని టచ్ చేసే సినిమా ‘కంచె’. సూటిగా చెప్పాలంటే చెప్పాలంటే ప్రేక్షకుడికీ దర్శకుదికీ ఎంత దగ్గరి తనం ఉంటుందో చూపిస్తూ ప్రేక్షకుడికీ సినిమా వర్గాల్కీ మధ్యలో ఉన్న కంచె ని తోలగించే సినిమా..

నటీనటుల ప్రతిభ:

వరుణ్ తేజ్: సమాజం లో మనుషుల మధ్య పెరుకు పోయిన అంతరాలపై అసహనం చూపించే యువకుడు దూపాటి హరిబాబు గా,ఒక ప్రేమికుడిగా తన అనుభవానికి ఎన్నోరెట్ల గొప్ప పెర్ఫార్మెన్స్ ని చూపించాడు వరుణ్ తేజ్.డైలాగ్ డెలివరీ, పదాల ఉచ్చారణలో కూడా చాలా క్లారిటీ అండ్ మెచ్యూరిటీ కనిపించింది. ఇంకోసారి  వరుణ్తేజ్ కి  ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుందో రాదో తెలీదు కానీ నటుడిగా తనకి మంచి గుర్తింపును తెచ్చి తన కెరీర్లో అలా నిలిచిపోయే సినిమా మాత్రం కంచె నే అవుతుంది.

ప్రగ్యా జైస్వాల్: ఇక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంది.ఆమె ఆరోజుల నాటి అచ్చమైన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి,ఆరోజుల్లో అమ్మాయిల హావబావాలను పలికించిన తీరుకి ఒక్కొక్కరూ దాసోహం అనేస్తారు. అంత చక్కగా కనిపించింది. ఐతే అందమే కాదు నటన లో కూడా ఆకట్టుకుంది సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.రాబోయే కొన్నేళ్ళలో ఆమె టాప్ హీరోయిన్ రేస్లో కూడా నిలవొచ్చు..

అలాగే విలన్ గా నికితిన్ దీర్ కు చాలా మంచి పాత్ర లభించింది . విలన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న నికితిన్ ఆ పాత్ర లో జీవించి మెప్పించాడు. హీరో పాత్ర ఎలివేట్ కావాలంటే విలన్ ధీటు గా ఉండాలి. ఈ సినిమాలో ఆ ప్లస్ పాయింట్ చక్కగా వర్కౌట్ అయింది. వరుణ్ కి తగ్గ పెర్ఫార్మర్ అని చెప్పొఛ్ఛు. ఇక అవసరాల శ్రీనివాస్ గురించి చెప్పేదేముందీ తన టైమింగ్ కామెడీ తో బాగానే నవ్వించాడు. ఇక మిగతా పాత్రల్లో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాస్ ,గొల్లపూడి మారుతీరావు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మరింత అందాన్ని ఇచ్చారు .

సాంకేతిక వర్గం పని తీరు:

ఒక ప్రేమకథ,దానికి సమస్య ఆనాటి కులవ్యవస్త భారతీయ చరిత్రలో కీలక గట్టం అయిన రెండో ప్రపంచ యుద్దం వెరసి కంచె ఒక అద్బుతం. క్రిష్ ఆలోచన ఎంత లోతుగా ఉంటుందో చెప్పే సినిమా ఇది ఒక మనిషిని మానవత్వం వైపు నడిపించే కథ ఇది… ప్రతీ ప్రేక్షకుడి నోటివెంటా ఇవే మాటలు. మొత్తానికి క్రిష్ మరో సారి కమర్షియల్ ఆర్ట్ సినిమా ని ఎలా తీయాలో,కోట్ల రూపాయలు స్టార్ల కోసమే ధారపోసి నష్టాల పాలై అపకీర్తిని మూట గట్టుకునే నిర్మాతలూ,దర్శకులూ ఎలా ఆలో చించాలో చెప్పాడు. ప్రేక్షకులకి కేవలం ఐటం సాంగులూ,ఫైట్లూ,పంచ్ డైలాగులే నచ్చుతాయి అన్న చీప్ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్న సినిమా ఇండస్ట్రీ
లోపాన్ని ఎత్తి చూపించాడు. ఐతే కొన్ని లోపాలు ఉన్నాయి కానీ సినిమా ఇచ్చే హైప్ లోనుంచే వచ్చే లోపాలవి.కొన్ని సీన్లలో ప్రేక్షకుడు మరింత గా కోరుకుంటాడు ఆ సీన్ ఇంకా గొప్పగా ఉంటుందేమో అనుకునటాడు అలాంటి పీక్ స్టేజ్ ని టచ్ చేయలేక
పోయారు. దానికి తోడు సినిమా మొదటి నుంచి చివరిదాకా స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే పాత్రల మధ్య ఎమోషన్ కంటెంట్ ని పూర్తి స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయాడు.లవ్ స్టోరీ లో కొతా దనం ఉన్నా సమాజం ఎలా ఉండేది అన్న అవగాహన ఉన్న వాల్లకి నెక్స్ట్ సీన్ ఏమిటీ అన్నది తెలిసిపోతూనే ఉంటుంది. ఐతే ఆ పార్ట్ ని అంత కన్నా వేరే లా తీసే చాన్స్ లేదు.

కానీ వార్ ఎపిసోడ్ విషయంలో కూడా ఎంతో ఉగ్విగ్న భరిత సీన్స్ అవి అసలు సినిమాకి అంత హైప్ తీసుకొచ్చిందే వార్ ఎపిసోడ్స్. ఈ విశయలో ఇంకాస్త క్లారిటీ ఇవ్వాల్సింది.ఇంకో విశయం ఏమిటంటే క్రిష్ కథని తనకు నచ్చిన ఒక డిఫరెంట్ ఫార్మాట్లో చెపుతాడు  అర్థమైన వారికి ఈ స్క్రీన్ ప్లే సూపర్బ్ అనిపిస్తుంది కానీ బీ,సీ సెంటర్ ప్రేక్షకులకి అంతగా నచ్చదు.  జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రాణం. 1936 ఫ్లేవర్ ని తెరపై చూపించడానికి జ్ఞాన శేఖర్ – ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ల కష్టం గురించి స్పెషల్ గా చెప్పాలి.అప్పటి వాతావరణాన్ని అలాగే చూపించటం లో వారి డెడికేషన్ కనిపిస్తుంది కంచె హిట్ లో వీరి
కృషి చాలా ఉంది. అలాగే వరల్డ్ వార్ ఎపిసోడ్ ని రియల్ గా అనిపించడం కోసం వారు వాడిన రియల్ వెపన్స్ కూడా సినిమాకి మరింత రియలిస్టిక్ ఫీల్ ని తీసుకొచ్చాయి. ఓవరాల్ గా తెలుగు స్క్రీన్ పై ఈ రేంజ్ విజువల్స్ అందించిన జ్ఞాన శేఖర్ – సాహి సురేష్ లకు హ్యాట్సాఫ్.. చిరంతన్ భట్ మ్యూజిక్ అండ్ రీ రికార్డింగ్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యింది. సూరజ్ – రామకృష్ణల ఎడిటింగ్ అంతగా బాలేదు. చాలా బోరింగ్ ఎలిమెంట్స్ మరియు సెకండాఫ్ పాటని కట్ చేసి ఉండచ్చు. ఇకపోతే వెంకట్ – డేవిడ్ ల యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అలనాటి మల్లయుద్దాన్ని గుర్తు చేస్తాయి. వరల్డ్ వార్-ఈఈ పార్ట్ ని కూడా బాగా కంపోజ్ చేసారు. రాజేవ్ రెడ్డి – సాయి బాబు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉండడమే కాకుండా ఒక హాలీవుడ్ ఫీల్ ని తెచ్చి పెట్టాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్.

 

ప్లస్ పాయింట్స్:

  • క్రిష్
  • వరుణ్ తేజ్ప్ర,గ్యా జైస్వాల్
  • రెండో ప్రపంచ యుద్ద సన్నివేశాలు
  • ఛాయాగ్రహణం
  • సినిమాటోగ్రఫీ
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • రొమాంటిక్ ట్రాక్

మైనస్ పాయింట్స్:

  • స్లో నేరేషన్
  • కథలో లోటు పాట్లు
  • కొన్ని సీన్ లు ఎక్స్పెటేషన్ ని రీచ్ కాక పోవటం
(Visited 135 times, 1 visits today)