Home / Entertainment / అఖిల్ కి పంచ్ ఇచ్చిన కంచె….!

అఖిల్ కి పంచ్ ఇచ్చిన కంచె….!

Author:
డైరెక్టర్ క్రిష్ మరియు మెగా ఫ్యామిలీ హీరొ వరుణ్ తేజ్  మూవీ కంచె అనూహ్యంగా 2 వారాల ముందుకు జరిగి అక్టోబర్ 22 వస్తుంది అని డైరెక్టర్ క్రిష్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అక్కినేని అఖిల్ హీరొగా నితిన్ నిర్మించిన అఖిల్ మూవీ కూడా దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 22న రిలీజ్ అవుతుంది అని ముందే ప్రకటించారు. కానీ సడన్గా కంచె కూడా అదే రోజు వస్తుండడంతో అఖిల్ మూవీ వాయిదా వేసినట్టు సమాచారం. నిర్మాత నితిన్ కూడా అఖిల్ వాయిదా విషయాన్ని ఫేస్‌బుక్ లో  పోస్ట్ చేశాడు. కానీ గ్రాఫిక్స్  వర్క్ వల్లనే సినిమా వాయిదా అని చెప్పాడు.
 ఇప్పటికే రుద్రమదేవి థియేటర్స్ ని  చాలా బ్రూస్లీ సినిమా లాగేసూకుంది మరి మళ్లీ ఒకే వారం వ్యవదిలో కంచె సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ అలొకేషన్ కష్టం అనే చెప్పాలి. కానీ ఈ పరిణామం మెగా ఫాన్స్ కి డబల్ దసరా ధమాక అని చెప్పుకోవాలి. రోటీన్ కి భిన్నంగ క్రిష్ తీస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి మరియు సినిమా ట్రైలర్ కి  కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మనం కూడా దసరా బరిలో నిలిచిన మెగా హీరొలకి ఆల్ ద బెస్ట్ చెబుదాం!
(Visited 43 times, 1 visits today)