Home / Entertainment / కన్ను పోయేంత కాటుక పెట్టుకుంటే అంతే మరి!

కన్ను పోయేంత కాటుక పెట్టుకుంటే అంతే మరి!

Author:

ఎవరీ అనసూయ రామలింగం? ఆనంద్ విహారి కి, అనసూయ రామలింగానికి ఉన్న బంధమేమిటి? ఇదేదో కామెడీ ట్విస్ట్ తో కూడుకున్న కథనం లా లేదూ…ఆ “ అ…ఆ..” సినిమా మూవీ ఆరంభ సన్నివేశం తాలూకు యు ట్యూబ్ వీడియో ను నితిన్ కొద్దిసేపటి క్రితమే ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఈ సినిమా కథ కన్నా..సినిమా వెనుక ఉన్న కథే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్‌లో కొనసాగుతున్న మ‌ల్లూవుడ్ హీరోయిన్ల ఆధిప‌త్యంలో ఇప్పుడు ఒక కొత్త మలుపు రావటమే ఈ సినిమా వెనుక ఉన్న కథ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెపుతున్నాయి. ఆసిన్‌, న‌య‌న‌తార, సమంత ల మాదిరే  టాలీవుడ్‌కి కేరళ నుంచి దిగుమతి అయిన కొత్త అమ్మాయి అనుపమ రాక తో “ అ..ఆ” లో సమంతా సీన్ సితార్ అయిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద హీరో నితిన్ కానీ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ అఫీషియల్ గా ఏమీ చెప్పకపోయినా , సమంతా మాత్రం ఈ పరిణామం తో రగిలిపోతున్నట్టు సమాచారం.

మ‌ళ‌యాళంలో కొద్ది రోజులుగా ఓ సినిమా నామ‌స్మ‌ర‌ణ జ‌రుగుతోంది. అదే ‘ప్రేమ‌మ్‌’. ఆ చిన్న ఇండ‌స్ర్టీలో చాలా త‌క్కువ టైంలోనే రూ.50 కోట్లు వ‌సూలు చేసిన ‘ప్రేమ‌మ్’ ఇప్పుడు సౌత్‌లో అన్ని భాష‌ల్లోను రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌ట‌న‌కు అక్క‌డ మ‌ల్లూవుడ్ ప్రేక్ష‌కులు మెస్మ‌రైజ్ అవుతున్నారు. అక్క‌డ అనుప‌మ ‘ప్రేమ‌మ్‌’లో చేసిన కీ రోల్‌కు మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఆ విషయామీ ఆమెకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ లో ప్లస్ పాయింట్ అయినట్టు సమాచారం. ఏది ఏమైనా, నితిన్ కీ, సమంతా కు మధ్య రేగిన వివాదం కారణంగా సమంత రోల్ చిన్నదై పోయిందా? లేక, సమంత దూకుడు ని తగ్గించటానికే త్రివిక్రమ్ కథను మార్చేశారా? అనే సందేహాలూ లేకపోలేదు.

ఇంత‌కు మ్యాట‌ర్ ఏంటంటే త్రివిక్రమ్- నితిన్ కొత్త ప్రాజెక్ట్ లో…అదేనండీ…”అ..ఆ” లో… సమంతకు తోడుగా అనుపమ పరమేశ్వరన్‌ కూడా ఎంపికైంది. హైదరాబాద్‌‌లో జరిగిన స్క్రీన్ టెస్ట్‌కు అనుపమ రావడం, డైరెక్టర్ ఓకే చేయడం కూడా జరిగిపోయింది. ‘ అ.. ఆ’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అనుపమది మెయిన్‌రోల్ అట‌. అనుప‌మ్ రోల్‌తోనే సినిమా మొత్తం ఉంటుంద‌ని…స‌మంత‌ది జ‌స్ట్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ మాత్ర‌మే అని స‌మాచారం. అదే జ‌రిగితే ప్రేమ‌మ్‌లో త‌న న‌ట‌న‌తో మ‌ల్లూవుడ్‌ను షేక్ చేస్తున్న అనుప‌మ టాలీవుడ్‌ను న‌య‌న‌తార లాగా ఓ వెలుగు వెలుగుతుంది అన‌డంలో సందేహం లేదు. వ‌చ్చి రావ‌డంతోనే స‌మంత‌ను ప్ర‌యారిటీ లేని పాత్ర‌లోకి నెట్టేసిన అనుపమ ఆమెకు పెద్ద షాకే ఇచ్చింద‌ని టాలీవుడ్‌లో ప‌లువురు గుస‌గుస‌లాడుకుంటున్నారు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో అని సమంత ప్రస్తుతం సీరియస్ గా ఆలోచిస్తోందట! మరి కన్ను పోయేంత కాటుక పెట్టుకుంటే, ఇలాగే అవుతుంది అంటూ ఫిల్మ్ నగర్ బాబులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పటికైనా సమంత తన మిడిసిపాటును తగ్గించుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. మరి వారి మాటలు ఈ మలయాళీ ముద్దుగుమ్మ తలకెక్కుతాయా? లేదా? అర్ధం కావటం లేదు..మరో పక్క, నితినేమో , తన మానాన తాను “అ..ఆ..” ఆరంభ వీడియో ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

(Visited 152 times, 1 visits today)