Home / Entertainment / అబ్బా…అవార్డ్ పట్టేసింది.

అబ్బా…అవార్డ్ పట్టేసింది.

Author:

Karati-Kalyani

అబ్బా పిండేశారు, బాబీ… వంటి డైలాగ్స్‌ వినగానే గుర్తుకోచ్చే పేరు కళ్యాణి. అయితే కాళ్యాని అంటే ఎవరు గుర్తు పట్టరు కాని కరాటే కళ్యాణి, హరికథ కళ్యాణి వంటి పేర్లుతో ఫ్యామస్‌ అయింది. తను హరికథా కళాకారిణి అంటే ఇట్టే గుర్తు పడుతారు. కళ్యాని ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపకురాలు కూడా, తాజాగా కరాటే కళ్యాణి ఒక అరుదైన ఘనత సాధించి వార్తల్లో నిలిచింది. ఆదిభట్ల కళాపీఠం ద్వారా నిరంతరంగా హరికథా ప్రవచనాలను నిర్వహించినందుకు గాను కళ్యాణికి ‘లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్’లో చోటు దక్కింది.

హైదరాబాద్ లోని సిద్దార్థ్ నగర్ లో 2015 జూన్ నెలలో 20 నుండి జూన్ 25 వరకు నిరంతరంగా 114 గంటల 45 నిమిషాల 55 సెకన్ల పాటు హరికథలను వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తనకి లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయ ఘోష్ నుండి లేఖ వచ్చినట్లు కళ్యాణి మీడియాకి తెలిపింది.

(Visited 591 times, 1 visits today)