Home / Political / ప్రాణం పోతుందని వేడుకున్నా స్పందించని జనం, ప్రాణాలు కోల్పోయిన యువకుడు.

ప్రాణం పోతుందని వేడుకున్నా స్పందించని జనం, ప్రాణాలు కోల్పోయిన యువకుడు.

Author:

కొన్ని సంఘటణలు చూస్తే ఈ ప్రపంచంలో మానవత్వం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. పట్టపగలే యాక్సిడెంట్ అయ్యి నడిరోడ్డు మీద పడిన ఒక 18 యేళ్ళ యువకుడికి అటుగా వెళ్ళేవారు ఎవరూ సహాయం చేయకపోవడంతో చివరికి అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సహాయం చేయడం దేవుడెరుగు ప్రాణాలు పోతున్నాయని ఆ బాలుడు ఎంత వేడుకుంటున్నా అంబులెన్స్ కి కాల్ చేయాల్సిన జనం అది మరిచి తమ ఫోన్లతో అతన్ని ఫోటొలు, వీడీయోలు తీసుకున్నారు. ఈ హృదయవిదారకర సంఘటణ కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో జరిగింది.

Karnataka boy bleeds to death as bystanders click photos and videos

కర్నాటకకు చెందిన 18యేళ్ళ అన్వర్ అలీ, బుదవారం ఉదయం 9 గంటల సమయంలో తన సైకిల్ పై వెలుతున్నాడు. అదే సమయంలో అతని వెనుకగా వచ్చిన కర్నాటక ఆర్టీసీ బస్సు అతనిని ఢీ కొట్టి, నడుము మీదుగా వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న అలీ చుట్టూ చేరిన జనం ఎవరు అతనికి సాయం చేయడానికి ముందుకు రాలేదు.. అంత బాధలో కూడా తనను కాపాడాలని అలీ ఎంత వేడుకున్నా అక్కడి ప్రజల మనసు కరగలేదు. అంబులెన్స్ కి ఫొన్ చేయాల్సినా వాళ్ళు అది మరిచి తమ ఫోన్లలో అలీ ఫోటోలు, వీడీయోలు తీసుకున్నారు. చివరికి యాక్సిడెంట్ జరిగిన 25 నిమిషాల తర్వాత అలీని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించేలోపు అతను మరణించాడు. యాక్సిడెంట్ అయిన వారిని ఆసుపత్రిలో చేరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం ఎంత చెబుతున్నా ప్రజలలో దీనిపై అవగాహన లేకపోవడంతో మనకెందుకులే అని వదిలేస్తున్నారు.

(Visited 927 times, 1 visits today)