Home / General / రైతు బిడ్డ.. నో కోచింగ్..ఇంట్లోనే ప్రిపరేషన్.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు!!

రైతు బిడ్డ.. నో కోచింగ్..ఇంట్లోనే ప్రిపరేషన్.. ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు!!

Author:

ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే మాటలు కాదు. అసలు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లే చాలా తక్కువ. పోటీ చూస్తే చాలా ఎక్కువ.. పైగా రిజర్వేషన్లు, రికమండేషన్లు, ఇవన్నీ తట్టుకుని ఒక్క గవర్నమెంట్ జాబ్ వచ్చిన అంతకన్నా అదృష్టం ఉండదు. అయినా గవర్నమెంటు జాబ్ అయితే చాలు ఎలాంటి పోస్టయినా పర్వాలేదు అనుకున్నోల్లకే దిక్కులేదు, కానీ, ఒక తెలుగు రైతు బిడ్డ ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేసాడు. విపరీతంగా ఉన్న కాంపిటీషన్ తట్టుకొని ఏకంగా ఒకే సారి నాలుగు పరీక్షల్లో విజయం సాధించాడు. పైగా… వాటిలో రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రెండు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటే మరి ఈ అబ్బాయి నక్క తోక తోక్కడనే అనుకుంటున్నారు జనమంతా. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా…?

getting four govt jobs

విశాఖ జిల్లా యలమంచిలికి చెందిన కర్రి రఘునాథ్‌ శంకర్‌ అనే రైతు బిడ్డ ఒకే సారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాడు. మామూలు పేద రైతు కుంటుంబంలో జన్మించిన రఘనాథ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఎలాంటి కోచింగులు లేకుండానే ఈ ఘనత సాధించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ జైళ్లశాఖలో జైల్‌ వార్డన్స్, పోలీసు శాఖ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్, ఇన్‌కమ్‌ టాక్స్, సీబీఐల్లో గ్రేడ్-బి ఉద్యోగాల కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షలతో పాటూ రైల్వే కమర్షియల్‌ అప్రంటీస్‌ పోస్టుకోసం నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించాడు. అప్లై చేసిన అన్ని ఉద్యోగాలు కొట్టేసాడు. అయితే వీటిలో తాను మాత్రం వీటిలో ఎస్‌ఐ పోస్టును ఎంచుకుంటున్నట్లు తెలిపాడు.

ఏళ్లకు ఏళ్లు కస్టపడి చదివినప్పటికీ ఒక్కటంటే ఒక్కటి కూడా గవర్నమెంటు జాబు కొట్టలేని వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచాడు రఘునాథ్. తండ్రి కర్రి సత్యనారాయణ రైతు కాగా, తల్లి నాగమణి సాధారణ గృహిణి. తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ స్థానిక గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలతో పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యాడు రఘునాథ్. నేను ప్రత్యేకించి ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. లైబ్రరీయే నా కోచింగ్‌ సెంటర్. నా తల్లిదండ్రులు, నాన్నమ్మ ప్రోత్సాహంతో మామయ్యను ఆదర్శంగా తీసుకుని ఈ విజయం సాధించాను అంటున్నాడు రఘనాథ్. కష్టపడితే అనుకున్నది సాధించొచ్చు అని నిరూపించిన రైతు బిడ్డ రఘునాథ్ కి హాట్సాఫ్.

(Visited 2,248 times, 1 visits today)