Home / Inspiring Stories / కట్జూ కి తెలుగు వర్షన్ రామ్ గోపాల్ వర్మ….ఆర్ జీ వి కి వైల్డ్ వర్షన్ కట్జూ….

కట్జూ కి తెలుగు వర్షన్ రామ్ గోపాల్ వర్మ….ఆర్ జీ వి కి వైల్డ్ వర్షన్ కట్జూ….

Author:

రామ్ గోపాల్ వర్మ కి, మార్కండేయ కట్జూ కి మొత్తానికి ఏదో ఒక రిలేషన్ షిప్ ఉండే ఉండాలనిపిస్తోంది. ఇద్దరూ వారి వారి రంగాలలో నిష్ణాతులు ….ఒకాయన చలన చిత్ర రంగంలో వరుసగా తనదైన ముద్రలు వేసుకుంటూ వెళుతుంటే, మరోకాయన విపరీతమైన న్యాయ కోవిదత్వంతో నిత్యం ….సోషల్ మీడియాకి సంచలనాలు పంప్ చేస్తూ ఉంటాడు. ఇద్దరి ఎనేర్జీ లెవెల్స్ కూడా సామాన్యమైనవి కావని వారి మిత్రులు , శతృవులు కూడా ఏక కాలంలో ఏకగ్రీవంగా ఒప్పుకునే విషయం…..అలాంటి వారిద్దరూ ఇటీవలి కాలంలో విపరీతమైన భావోద్వేగానికి లోనవుతున్నట్టు కనిపిస్తోంది. బీఫ్ తినాలా, వద్దా అనే విషయం మీద తన బ్లాగ్ లోనూ, ఫేస్ బుక్ పేజ్ వాల్ మీద పుంఖాలు పుంఖాలుగా అక్కర్లేని వ్యాఖ్యానాలు చేస్తున్న ఈ సెన్సేషనల్ మాజీ జడ్జి మార్కండేయ కట్జూ…మొన్నటికి మొన్న వారణాసిలో కావల్సినంత వ్యతిరేకతను భుజాన మోశారు. రామ్ గోపాల్ వర్మ కూడా నిన్నటి కి నిన్న తన ఫేస్ బుక్ వాల్ మీద పవన్ కళ్యాణ్ కి హితబోధ చేస్తూ….ముందు పవన్ కళ్యాణ్ రైతులను ముందుకు తీసుకు వెళ్ళే కన్నాముందు, తన ఫ్యాన్స్ ను బాగు చేయాలంటూ సలహా ఇచ్చారు. తన సినిమాలు చూడటానికి రైతులు ఎలాగూ టికెట్లు కొనుక్కునే పరిస్థితిలో ఉండరు కాబట్టి, టికెట్లు కొనుక్కునే తన ఫ్యాన్స్ ఆలోచనా విధం మార్చాలంటూ చురకలంటించారు. తనని వారి ఆలోచనల్లో హత మార్చగలరేమో కానీ, తన ఆలోచనా విధానాన్ని చంపలేరంటూ రామ్ గోపాల్ వర్మ చాలా బొల్డ్ గా తన వాల్ మీద రాసుకున్నాడు. అంటే కాదు తన ఇంగ్లీష్ ట్వీట్స్ ని అర్ధం చేసుకోలేని నిరక్షర కుక్షులైన వారి కోసం, వాటిని తెలుగు లో అనువదించాల్సిందిగా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఆయన విజ్ఞప్తి కూడా చేశాడు. సాంకేతికంగా వికలాంగులైన వారి కోసం ఆ మాత్రం సాయం చేయందంటూ అభ్యర్ధించాడు. హఠాత్తుగా మరణించిన రామ్ గోపాల్ వర్మ …సినీ పరిశ్రమకి పట్టిన పీడ తొలగిపోయిందంటూ కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన పోస్టింగ్ ను తన వాల్ మీద మరో సారి పోస్ట్ చేసుకుని మరీ ..రామ్ గోపాల్ వర్మ…పైన చెప్పిన కామెంట్స్ అన్నీ చేశాడు. అడుసు తొక్కనేల..కాలు కడగనెల అని వెనుకటికి ఒక సామెత ఉంది…ముందు ఏదో ఒకటి రచ్చ చేసి..ఆ తర్వాత వచ్చే పర్వ్యవసానాలకి రామ్ గోపాల్ వర్మ లాంటి ధీరుడు మనస్తాపానికి గురి కావటమే ఇప్పుడు ఆర్ జీ వీ ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…..తమ బోల్డ్ డైరెక్టర్ ఆర్ జీ వి కి కావలసినంత మన ధైర్యాన్ని ఇవ్వవలసిందిగానూ, అలాగే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ లాగా పలు రకాల సమాజాలను, ధర్మాలను తూలనాడుతున్నప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా రేపటి కి మరింత శక్తి ని పుంజుకునే తరహా శక్తి యుక్తులను ప్రసాదించాల్సిందిగా నూ వారిప్పుడు సర్వమత ప్రార్ధనలు చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ ram gopal varma facebook posting

ఒక వ్యక్తి బతికుండగానే, అతను మరణించాడని ఫోటో లతో సహా పోస్ట్ చేయటం అనేది నైతికంగా దుర్మార్గమైన విషయం అనే అంశంలో ఎవరికీ ఎలాంటి బేధాభిప్రాయాలు లేనప్పటికీ, వారు ఆ తరహా పోస్టులు పెట్టేందుకు ప్రేరేపించే ట్వీట్స్, ఫేస్ బుక్ పోస్టింగులు అవసరమంటారా? నేల మీద పోయేది, వాసన చూసి నెత్తికి రాసుకునే తీరు మార్చుకోకపోయినా … పిలిచి మరీ పిండం పెట్టించుకునే ధోరణి విడనాడకపోయినా …మార్కండేయ కట్జూ కైనా…రామ్ గోపాల్ వర్మకైనా ఈ తరహా ఇబ్బందికర వాతావరణం ఎదురు కాక మానదు. ఎందుకంటే సమాజంలో వారిద్దరికన్నా ఫ్రస్టేట్ అవుతూ జీవనం సాగిస్తున్న కోట్లాది మంది జనాభా ఉన్నారు. వారందరూ కూడా ఇలా సోషల్ మీడియా వాల్స్ మీద తమ ప్రతిభా పాటవాల్ని చాటితే..చదవటానికి..చూడటానికీ జనమూ మిగలరు…సమయమూ చాలదు. దేవుడు రెండు కళ్ళతో మంచి, చెడు చూడమని చెపుతూనే, ఒక చేత్తో మాత్రమే రాసుకునే ఫెసిలిటీ ఇచ్చింది ..మంచి ని మాత్రమే రాయమని..అది కట్జూ కి కానీ, ఆర్ జీ వి కి కానీ..సినీ హీరో ల అభిమానులకి కానీ అందరికీ వర్తించే విషయం….

(Visited 113 times, 1 visits today)