Home / Entertainment / రామ్‌చరణ్‌ చిత్రంలో కౌశల్ కీలక పాత్ర ?

రామ్‌చరణ్‌ చిత్రంలో కౌశల్ కీలక పాత్ర ?

Author:

తెలుగు బిగ్ బాస్ సీజన్ – 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రేజీ సెలబ్రిటీ అయ్యాడు. ఇప్పటికే అభిమానులు కౌశల్ ఆర్మీ పేరుతో కౌశల్ కు భారీగా మద్దతు అందిస్తున్నారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచినందుకు అభిమానులనుండి – ప్రేక్షకులనుండి కౌశల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చిత్రంలో కౌశల్ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ‌బిగ్‌బాస్‌ ట్రోఫీ దక్కించుకున్న కౌశల్‌కు ఎందరో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి తన తండ్రి చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘స్టేట్‌ రౌడీ’ పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Kaushal-to-play-key-role-in-Ram-Charan

త్వరలోనే ఈ విషయమై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

(Visited 1 times, 1 visits today)