Home / Inspiring Stories / మాట నిలబెట్టుకున్న కేసిఆర్.

మాట నిలబెట్టుకున్న కేసిఆర్.

Author:

పావలా శ్యామల 34 సంవత్సరాల నాటకాల్లో అపార అనుభవం… 250 సార్లు ఉత్తమ నటి అవార్డు.. 40 నాటకాలకు ఉత్తమ దర్శకత్వం అవార్డు… 10 ఏళ్లు బుల్లితెర, వెండితెర ఆర్టిస్టుగా అనుభవం. … 100 సినిమాల్లో బలమైన క్యారెక్టర్లు ఇవన్నీ ఆమె రికార్డులు. కళనే జీవితంగా చేసుకుని బతికిన పావలా శ్యామలకు ఇప్పుడు ఇంటి కిరాయి కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుండాల్సిన పరిస్థితి. దీనికి కారణాలు ఏవైనా కావొచ్చు. కష్టాల్లో ఉన్న మనిషిని సాటి మనిషిగా ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆకలితో అవకాశాల కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ కన్నీళ్లు తెప్పించే పావలా శ్యామల అంటూ పలు టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వూస్ తో ఇమె పరిస్థితి సీఎం కేసీఆర్ కు తెలియడంతో ఆయన పెద్దమనసుతో ఆదుకున్నారు.అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు.

KCR Helped Pavala Shyamala

పావలా శ్యామలని ఆదుకుంటానన్న కెసిఆర్ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. అనారోగ్యానికి గురై, సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పావలా శ్యామలను ఆదుకుంటామని ప్రతి నెలా 10 వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని గతంలో సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు ఆ బాధ్యతలను అప్పగించారు. గురువారం హరికృష్ణ మార్చి, ఏప్రిల్ నెలల పింఛన్ పావలా శ్యామలా బ్యాంకు ఖాతాలో వేశారు. ఈ సందర్భంగా పావలా శ్యామలా కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన పావలా లేని శ్యామల కథనానికి స్పందించి తన ప్రాణాలు కాపాడిన వారయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. తనపట్ల నమస్తే తెలంగాణ చూపిన చొరవ మరువలేనిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని, తనలాంటి ఎంతోమంది కళాకారులకు ప్రభుత్వం దారి చూపుతున్నదని పేర్కొన్నారు.

Must Read: బ్రహ్మోత్సవం సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 3,313 times, 1 visits today)