Home / Inspiring Stories / పావలా శ్యామలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం.

పావలా శ్యామలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం.

Author:

Pavala Shyamala

పావలా శ్యామల 34 సంవత్సరాల నాటకాల్లో అపార అనుభవం… 250 సార్లు ఉత్తమ నటి అవార్డు.. 40 నాటకాలకు ఉత్తమ దర్శకత్వం అవార్డు… 10 ఏళ్లు బుల్లితెర, వెండితెర ఆర్టిస్టుగా అనుభవం. … 100 సినిమాల్లో బలమైన క్యారెక్టర్లు ఇవన్నీ ఆమె రికార్డులు. కళనే జీవితంగా చేసుకుని బతికిన పావలా శ్యామలకు ఇప్పుడు ఇంటి కిరాయి కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులుండాల్సిన పరిస్థితి. దీనికి కారణాలు ఏవైనా కావొచ్చు. కష్టాల్లో ఉన్న మనిషిని సాటి మనిషిగా ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆకలితో అవకాశాల కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ కన్నీళ్లు తెప్పించే పావలా శ్యామల అంటూ పలు టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వూస్ తో ఇమె పరిస్థితి సీఎం కేసీఆర్ కు తెలియడం తో ఆయన పెద్దమనసుతో ఆదుకున్నారు.అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆదివారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో పావలా శ్యామల కేసీఆర్‌ను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ శ్యామలకు తక్షణ సాయం కింద రూ. 20 వేలు ఇచ్చి.. తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున నెలకు రూ. 10 వేల పింఛన్ ఇవ్వాలని డైరెక్టర్ మామిడి హరికృష్ణకు ఆదేశించారు. ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్న శ్యామలాకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమె ఎంతో సంతోష పడింది..

మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా స్పందించి, తన వంతు సాయంగా రూ.20 వేల రూపాయలను ఆవిడకు అందించారు. అంతేకాక ప్రతి నెల తన బ్యాంక్ ఎకౌంట్ నెంబర్‌లో రూ. 5 వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని తెలిపారు.

(Visited 102 times, 1 visits today)