Home / Inspiring Stories / తండ్రి కోసం ఈ కొడుకు చేసిన చిన్న పని ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనం అయ్యింది.

తండ్రి కోసం ఈ కొడుకు చేసిన చిన్న పని ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనం అయ్యింది.

Author:

కనిపించని దేవుడి కన్నా కళ్ళ ముందు కనిపించే మన తల్లితండ్రులె దేవుళ్ళతో సమానం. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని వారిని పూజిస్తాం కాని రోజు రోజుకి పెరిగిపోతున్న వృద్దశ్రమాలను చూస్తుంటే తల్లితండ్రుల పట్ల నేటి యువతరానికి ఉన్న ప్రేమ అందోళన కలిగిస్తోంది. మనం చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ఎన్ని వేశాలేసినా అన్నీ భరించి మనల్ని సక్రమంగా పెంచి పెద్దవాళ్ళని చేసిన తల్లితండ్రులకు మనం ఎం ఇచ్చిన వారి రుణం తీర్చుకోలేము కాని కొంతమంది పిల్లలు వారిని గౌరవించకపోగా, వీలైనప్పుడల్లా వాళ్ళకే నీతులు చెబుతుంటారు. కానీ కేరళ కు చెందిన డేవిస్ మాత్రం తల్లిదండ్రుల విలువ తెలిసినోడు. అమ్మానాన్న ప్రేమ ఏంటో రుచి చూసినోడు అందుకే వాళ్ళ కోసం అతను చేసిన ఒక చిన్న పని ఇప్పుడు అతన్ని ఇంటర్నెట్ సంచలనం గా మార్చింది.

kerala man loves father

అసలు మాటర్ ఏంటంటే , కేరళకు చెందిన డేవిస్ బహ్రెయిన్ లో ఉద్యోగం చేస్తుంటాడు. తన తల్లి దండ్రులని ఎన్ని సార్లు తమ వద్దకు రమ్మన్నా వచేవాళ్ళు కాదు. ఎన్ని సార్లు అడిగిన తన తండ్రి నోటి వెంట నో అనే సమాధానమే వచ్చేది. ఎం చేయాలో అర్థం కాక చాలా సార్లు వదిలేసినప్పటికీ, ఆలోచిస్తే అసలు వారు బహ్రెయిన్ ఎందుకు రానంటున్నారో కారణం దొరికింది. చిన్నతనం నుంచీ తన తండ్రి ఏ రోజూ చెప్పులు వేసుకుని ఎరగడు.అలాగే కేరళ లో వాడే ఒక ప్రత్యేకమైన నూలుతో చేసిన లుంగీ, నడుముకి ముందు (బెల్ట్ లాంటిది) తప్ప ఇంకే రకమైన దుస్తులు అలవాటులేవు. ఇప్పుడు తన కొడుకు తో విదేశం వెళ్ళాలంటే తన అలవాట్లు మార్చుకొని వెళ్ళలేడు. ఇలాగే వెళ్తే కొందరు నవ్వుకోవచ్చు..తన కొడుకు మర్యాద కూడా పోవచ్చేమో అన్నది తండ్రి దిగులు. ఇదంతా గమనించిన కొడుకు ఒక చక్కటి పరిష్కారం కనుక్కున్నాడు. తన తండ్రిని ఒప్పించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తండ్రి ఒక్కడే అలా లుంగీ, చెప్పులు లేకుండా వెళ్తే వింతగా చూస్తారేమో అని తానూ కూడా అచ్చం తండ్రి లాగే వెళ్తే ఇంకా ఇబ్బంది ఏముంటుంది అనుకుని ఫిక్సయ్యాడు. అచ్చం తన తండ్రిలాగే తయారయ్యాడు. తల్లి తండ్రుల్ని తీస్కుని బహ్రెయిన్ వెళ్ళాడు. ఈ పోస్ట్ ఫేస్బుక్ లో పెట్టగానే విపరీతంగా షేర్ అయింది.. వైరల్ అయ్యింది.

నిజమే కదా.. అలా తండ్రి కాయ కష్టం తోనే ఇంతవాల్లమయ్యాక వాళ్ళ అలవాట్లనో, పద్దతులనో తప్పు పట్టకూడదు. ఎందుకంటే ఆ అలవాట్లు పద్దతులతోనే మన చిన్నతనం, బాల్యం గడుస్తుంది. ఇవాళ పెద్ద ఉద్యోగమో, ఎక్కువ జీతమో లేదంటే విదేశాల్లో బతుకుతున్నామనో మనం ఎదిగిపోయినట్టుకాదు. వాళ్ళ వల్లే మనం ఇవ్వాళ ఈ స్థితి లో ఉన్నాం. అయినా తల్లిదండ్రులు బతికుండగా వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి కానీ వాళ్ళు మరణించాక సమాధులు కట్టించి, వాటికి పూలాభిషేకం చెయ్యడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు డేవిస్. తన తండ్రి చెప్పులు కూడా లేకుండా రక్తం కారినా అలాగే నడిచి తనని సరైన దారిలో పెట్టాడు. ఇవాల్టి తన ఉన్నతి ఆయన కాళ్ళు రక్తం ధారపోసిందే అని చాల గర్వంగా చెప్పుకుంటున్నాడు డేవిస్. కరెక్టే.. డేవిస్ చాలా పర్ఫెక్ట్ అని అందరూ ఒప్పుకుంటున్నారు. దానికి నిదర్శనమే లెక్కలేనన్ని ఆన్లయిన్ షేర్స్, లైకులు. ఆన్లైన్ ప్రజల హృదయాలు దోచుకున్నారు ఈ తండ్రీ కొడుకులు.. హాట్స్ ఆఫ్ టు దెం ఫ్రం అలజడి.

(Visited 1,109 times, 1 visits today)