Home / Entertainment / ఖైదీ నం 150 గా మన ముందుకు వస్తున్న మెగాస్టార్.

ఖైదీ నం 150 గా మన ముందుకు వస్తున్న మెగాస్టార్.

Author:

టాలీవుడ్ మెగాస్టార్ ఎనిమిది సంవత్సారాల తరవాత నటిస్తున్న చిత్రం ఖైదీ నం 150. ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని తెలుగు అభిమానులంతా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తమిళ సినిమా అయిన కత్తి సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి ఈ సినిమాకు ముందు చాలా కష్టపడి మరి తనను తానూ మార్చుకొని మునుపటి బాడీని తెచ్చుకున్నాడు.

ఈ రోజు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా తను తాజాగా నటిస్తున్న సినిమా పేరును అలాగే ఈ సినిమాలో పని చేసే ముఖ్యమైన విభాగాలకు చెందిన అందరి పేర్ల తరువాత….. చివరికి బాస్ ఇస్ బ్యాక్ అంటూ చిరంజీవి అదిరిపోయి స్టెప్ తో తన 150 వ సినిమా ఖైదీ నం150 వ సినిమా పోస్టర్ ని విడుల చేశారు.

ఈ సినిమాకు మాస్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండటం చెప్పుకోదగిన విషయం. కొణిదెల ప్రొడక్షన్ కంపీనీ పై మొదటి సారి మెగాపవర్ స్టార్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ఈ సినిమాకు ఇప్పటికే అదిరిపోయే పాటలను కంపోజ్ చేసినట్టు తెలియజేసారు.

(Visited 94 times, 1 visits today)