Home / Entertainment / భయపెడుతున్న ‘కళావతి’ ట్రైలర్.

భయపెడుతున్న ‘కళావతి’ ట్రైలర్.

Author:

హీరో సిద్దార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ భాజ్వా ప్రధాన పాత్రలో నటించగా సుందర్ సీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కళావతి’. చంద్రకళ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఆడియో ఇటివలే విడుదలైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమిళంలో ఈ చిత్రాన్ని ‘అరన్మని-2’ పేరుతో విడుదల చేస్తున్నారు. హారర్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం ‘చంద్రకళ’ చిత్రం కంటే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్ర నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కూడా భయ పెడుతుంది. ఇక ఈ చిత్రానికి హైప్ హాప్ తమిజా సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో సిద్దార్థ్, త్రిష, హన్సిక వంటి ప్రముఖులు నటిస్తుండటంతో విడుదలకి ముందే ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సర్వంత్రమ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా తెరకెక్కించిన ‘కళావతి’ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

(Visited 160 times, 1 visits today)