Home / Inspiring Stories / ప్రపంచంలోనే భారత్ ని మించిన దేశం లేదని కితాబిచ్చిన సౌదీ మేధావి.

ప్రపంచంలోనే భారత్ ని మించిన దేశం లేదని కితాబిచ్చిన సౌదీ మేధావి.

Author:

భిన్నత్వంలో ఏకత్వం అంటేనే భారతదేశం. భిన్న మతాలూ, కులాలు ఎన్ని ఉన్నా అంతా ఒక్కటిగా సమానత్వంతో ప్రజాస్వామ్యబద్దంగా కలిసిమెలిసి ఉన్న దేశం మనది. ప్రపంచం మొత్తంలో భారతదేశంలాంటి దేశం ఇంకోటి లేదని సౌదీకి చెందిన ఖలెద్ అల్ మయీన అనే మేధావి భారత్ ని సందర్శించిన తరువాత ఒక పత్రికలో వ్యాస రూపంలో వెలిబుచ్చాడు. సారే జహాసే అచ్చా భారత్ దేశ్ హమారా అని ఎలుగెత్తి చాటాడు ఆ వ్యాసంలో..ఆ సౌదీ మేధావి సౌదీ గెజిట్ అనే పత్రికు రాసిన వ్యాసంలో ఇంకా ఎమన్నారంటే…

Khaled Almaeena about indians

భారత దేశం లో వందకన్నా ఎక్కువ కులాలు, మతాలూ, భాషలు ఉన్నాయి అయినా అంటా కలిసికట్టుగా ఒకే కుటుంబంలా ఒకరికోకరు సహాయం చేసుకుంటూ జీవిస్తారు. అనేక దేవుళ్ళు, పూజలు ఇలా ఎన్ని వైరుద్యాలున్నా అవన్నీ వారి ఆచారాల వరకే.. సమాజంలో ఐకమత్యంతో కలిసి మెలిసి ఉంటారు. ఎలాంటి గొడవలూ రాగద్వేషాలు లేవు. అదే మా వద్ద ఒకే మతం, ఒకే దేవుడు కానీ మాలో మాకే గొడవలు, రక్తపాతాలు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నింటికి భారత్ ఆదర్శప్రాయం. భారత్ ప్రజల శాంతియుత సహజీవనాని చూస్తుంటే నాక అసూయగా, ఈర్ష గా ఉంది అని కూడా ఆయన తన వ్యాసంలో మొహమాటం లేకుండా రాశారు.

అనేక దేశాల్లో నాయకులు శాంతి, సహనం అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం చూస్తాం కానీ అవన్నీ పక్కాగా పాటించే దేశం భారత్ మాత్రమే.. ప్రాచీన కాలం నుండి శాంతియుత, సామరస్యక జీవనాన్ని ఆచరణాత్మకంగా చూపిస్తున్న ఏకైక దేశం భారతదేశం. భారత్ పేద దేశం అంటారు కానీ సంస్కృతీ, సహనం,విజ్ఞాన భాండాగారం భారత్ అని కూడా చెప్పుకొచ్చారు. అంతెందుకు మా సౌదీలో పెట్రోల్ లేక ముందు మేమూ పేదవాల్లమే. కానీ ధన ప్రవాహం వచ్చాకా మాలో అహం, అధికారం, అల్లర్లు అన్నీ పెరిగాయి. ఈ భూ మండలం మీద అత్యంత సహనం గల ఏకైక దేశం భారతదేశం అని నొక్కి చెప్పారు. యస్..మనం భారతీయులం.. ఈ దేశ పౌరులుగా ఇది మనకు గర్వకారణం. జై భారత్..జై హింద్.. వందేమాతరం ..

(Visited 20,106 times, 1 visits today)