Home / Entertainment / మా నాన్నని చంపేయండి : రవి బాబు

మా నాన్నని చంపేయండి : రవి బాబు

Author:

 

గజ ఈత గాడు ఒక చిన్న నీటి కాలువలో పడి మరణించాడన్నట్టు తయారయ్యింది టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు పరిస్థితి. దాదాపు 50 ఏళ్ల నట జీవితంలో ఏనాడూ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని ఆయన జీవితం ఒక చిన్న మాట తో తలకిందులైంది. యావత్ ప్రపంచం ఆయన మీద ఎదురు దాడి చేస్తోంది. రీసెంట్ గా జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మహిళలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పెను తుఫాను నే సృష్టించింది. దీనిపై ఆయన పలుమార్లు క్షమాపణలు చెప్పినప్పటికీ వేడి ఇంకా చల్లారటం లేదు. మహిళా సంఘాలు, తోటి నటులే కాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో సహా అందరూ ఆయనపై విరుచుకు పడ్డారు.. దాంతో తప్పు తెలుసుకున్న ఆయన క్షమించమని కోరినప్పటికీ, సమస్య మరింత జటిలమైంది. కొందరు ఆయనపై నిర్భయ చట్టం కింద కూడా కేసు పెట్టారు.

ravi babu about his father

ఆయన చేసిన తప్పుకు ఇప్పటికే పలుమార్లు క్షమాపణలు చెప్పినా వివాదాన్ని అంతకంతకూ ఎక్కువ చేస్తున్నారని చలపతి రావు కుమారుడు, నట దర్శకుడు అయిన రవిబాబు అభిప్రాయపడ్డారు. ఇలా మానాన్నను మానసికంగా హింసించడం కంటే.. రాళ్లు తీసుకుని ఒకేసారి కొట్టి చంపేయమని ఆయన అవేదన వ్యక్తం చేశారు. కొందరు మా నాన్నకు మద పిచ్చి ఎక్కువై అలా మాట్లాడారంటున్నారు. నిజమే మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ మమ్మల్ని ఎక్కడ సరిగా చూసుకోదేమో అని తన సుఖాలను త్యాగం చేశారు నా తండ్రి. అదీ అయన వ్యక్తిత్వం. అయినా సరే, ఆయన నోరు జారారు. అది ముమ్మాటికీ తప్పే. చేసిన తప్పుకు ఆయన ఎంతో మనోవేదన పడుతున్నారు. మా నాన్న సామాన్యుడు కాబట్టే, కొంత మంది ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయాలని చూస్తున్నారు. గతంలో చాలా మంది పెద్దవాళ్లు ఆడవాళ్లపై ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు మా నాన్నపై విరుచుకుపడుతున్నాయి అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇదే విషయమై చలపతి రావు మాట్లాడుతూ, 73 ఏళ్ల వయసు, 50 సంవత్సరాల తన నట జీవితంలో, అనాలోచితంగా నేను చేసిన ఒక వ్యాఖ్య, దురదృష్టకరం. ఆడవాళ్లతో హానికరమా ?అని ఒక లేడీ యాంకర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా, ఆడవాళ్లు హానికరం కాదు.. పక్కలోకి పనికొస్తారు అని నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదేపదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్ర హీనుడిగా మార్చేశారని’ వాపోయారు.

(Visited 4,108 times, 1 visits today)