Home / Entertainment / మంచి బిసినెస్ చేస్తున్న వర్మ సినిమా

మంచి బిసినెస్ చేస్తున్న వర్మ సినిమా

Author:

killing veerappan

దక్షిణ భారతదేశంలోని మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి వణికించిన స్మగ్లర్ వీరప్పన్. చాలా రోజులు అతన్ని వేటాడి చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రావడం వలన ‘కిల్లింగ్ వీరప్పన్’పై మొదటి నుంచి అంచనాలున్నాయి. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా మారింది.

ఇటీవలే ఈ సినిమాని డిసెంబర్ 4న రిలీజ్ చేయనున్నామని అనౌన్స్ చేసారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రిలీజ్ ముందే ఉన్న క్రేజ్ వలన శాటిలైట్ రైట్స్ కి బంపర్ ఆఫర్ వచ్చింది. ఓ లీడింగ్ చానల్ 3.5 కోట్లకి ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మొదటి కన్నడ సినిమా కావడం కూడా కిల్లింగ్ వీరప్పన్‌కు ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో కలిపి సుమారు 2000 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ఒకప్పుడు వర్మ నుండి సినిమా వస్తుందంటే ఎంతో ఆసక్తి ఉండేది , కానీ ఇటివల వర్మ సినిమా అంటే కనీసం పోస్టర్స్ చూసే వారు కూడా లేకుండా పోయారు..వరుస పెట్టి తీస్తున్న డిజాస్టర్ చిత్రాలతో తన ఉనికిని కోల్పోయాడని అందరు భావించారు కానీ తాజాగా వర్మ తీసిన ‘కిల్లింగ్ వీరప్పన్’కి జరిగిన బిసినెస్ చూస్తుంటే తనలో ఏ మాత్రం ఉనికి తగ్గలేదని నిరూపించాడు.

(Visited 144 times, 1 visits today)