Home / Entertainment / కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ కి తొలగిన అడ్డంకి

కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ కి తొలగిన అడ్డంకి

Author:

veerappan

ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రానున్న మరో రియల్ లైఫ్ స్టొరీ ‘కిల్లింగ్ వీరప్పన్’. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడం మరియు ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో ‘కిల్లింగ్ వీరప్పన్’‌పై మొదట్నుంచే క్రేజ్ నెలకొంది. ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 4న రిలీజ్ అనుకుంటే రిలీజ్ కి వారం ముందు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి సినిమాపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేసింది. ‘కిల్లింగ్ వీరప్పన్’ మూవీ అన్ని అడ్డంకులు తొలగించుకుని జనవరి 1, 2016న విడుదలయ్యేందుకు అంతా సిద్ధమైన నేపథ్యంలో మరో అడ్డంకి వచ్చి పడింది. ఈ సినిమా విడుదల నిలిపి వేయాలని మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. సినిమా మొత్తం తప్పుల తడకే, సినిమాలో అవాస్తవాలు చిత్రీకరించారు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు. ‘సినిమాలో మొత్తం తప్పుడు సమాచారంతో చిత్రీకరించారు. అవాస్తవాలను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైతే తమిలనాడులో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది’ అని పిటీషనర్ పనీర్‌సెల్వి తన పిటీషన్లో పేర్కొన్నారు.

ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ జారీ చేసిన ‘యూ’ సర్టిఫికెట్ వెనక్కి తీసుకోవాలని కోరారు. కేవలం కర్నాటక పోలీసులు మాత్రమే 2004లో వీరప్పన్‌ను చంపినట్లు చూపించారు. ఇందులో తమిళనాడు పోలీసులు, రాజకీయ నాయకుల ప్రమేయం అసలు లేదనే విధంగా చూపించారు. ఇలా చేయడం వారిని అవమానించడమే అని పిటీషనర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. అయితే అది ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఈ వాదనని తోసిపుచ్చింది. దానితో కిల్లింగ్ వీరప్పన్ రిలీజ్ అనుకున్న టైం కి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

(Visited 79 times, 1 visits today)