Home / Entertainment / మళ్ళీ వాయిదాపడ్డ ‘కిల్లింగ్ వీరప్పన్’

మళ్ళీ వాయిదాపడ్డ ‘కిల్లింగ్ వీరప్పన్’

Author:

veerappan

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో ఓ రియలిస్టిక్ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది.

జనవరి 1న కొత్త సంవత్సర కానుకగా తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి సినిమా రిలీజ్ కానుందని ప్రకటించి అభిమానుల ఎదురుచూపులకు కిల్లింగ్ వీరప్పన్ టీమ్ తెరదించింది. ఇక కొత్త సంవత్సర కానుకగా వర్మ సినిమాను ఆస్వాధిద్దామని ఫిక్స్ అయిపోయిన ప్రేక్షకులకు చివరి నిమిషంలో మరోసారి చేదువార్త వచ్చిపడింది. సెన్సార్ సంబంధిత పనులు పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు వర్మ చివరి నిమిషంలో ప్రకటించారు. కన్నడ వర్షన్ మాత్రం ఇవ్వాళే విడుదలవుతోంది. ఇక కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వర్మ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వర్మ ఈజ్ బ్యాక్ అన్న ప్రచారం పొందుతూ ట్రైలర్, పోస్టర్స్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడం కూడా ఈ సినిమాకు విశేషంగా చెప్పుకోవచ్చు.

(Visited 89 times, 1 visits today)