Home / Reviews / కిల్లింగ్ వీరప్పన్ రివ్యూ & రేటింగ్.

కిల్లింగ్ వీరప్పన్ రివ్యూ & రేటింగ్.

Author:

Killing Verappan Perfect Review and Rating

ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. సినిమా మొదలుపెట్టినప్పటి నుండి వివాదాలతోనే సగం పబ్లిసిటీ పొందిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, సందీప్ భరద్వాజ్ ‘వీరప్పన్’ పాత్రలో నటించాడు. యాగ్నా శెట్టి, పరుల్ యాదవ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కన్నడలో జనవరి 1న విడుదలవగా., తెలుగులో జనవరి 7న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

రామ్ గోపాల్ వర్మ కథా పరంగా ఎలాంటి ఇబ్బంది రాకూడదనే సినిమా ప్రారంభంలోనే ‘నాకు తెలిసిన నిజంతో చేసిన సినిమా’ ఇదని వేసుకున్నాడు.. ఇక అసలు కథలోకి వెళితే.. చాలా వరకూ అందరికీ తెలిసిందే.. తమిళ, కన్నడ రాష్ట్రాలను గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ ని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఎలా మత్తు బెట్టింది అనేదే కథ.. తమిళనాడుకి చెందినా కె. విజయ్ కుమార్ తన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంతో వీరప్పన్ ఫినిష్ చేయడం కోసం కకూన్ అనే మిషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ మిషన్ ని పోలీస్(శివరాజ్ కుమార్) డీల్ చేస్తాడు. అతని ఈ మిషన్ మీద తన టీంతో ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యి ఎవరెవరి సాయంతో వీరప్పన్(సందీప్ భరద్వాజ్)ని రీచ్ అయ్యాడు. ఎలా అతన్ని చంపాడు అన్నదే కిల్లింగ్ వీరప్పన్ కథ.

అలజడి విశ్లేషణ:

వీరప్పన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కాబట్టి ఈ చిత్రంలో కమర్షియల్ ఎలెమెంట్స్ ఆశించకుండా ప్రేక్షకులు సినిమాని చూస్తే ఈ మధ్యకాలంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. ఇంటర్వెల్ కు ముందు జరిగే అటాక్ సీన్ సినిమాకు హైలైట్. ఆ సన్నివేశంలో కెమెరా వర్క్ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వర్మ ముద్ర ప్రధానంగా ఈ సన్నివేశంలో.. తర్వాత క్లైమాక్స్ లో కనిపిస్తుంది. ప్రథమార్ధంలో ఉన్నంత ఆసక్తి.. ద్వితీయార్ధంలో లేనప్పటికీ.. వీరప్పన్ ను అంతమొందించే క్లైమాక్స్ సన్నివేశాన్ని తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కించాడు వర్మ. రామ్ గోపాల్ వర్మ ఈ వీరప్పన్ స్టొరీని కేవలం శివరాజ్ కుమార్ అనే పోలీస్ యాంగిల్ లో మాత్రమే చూపించారు. ఇక ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన శివరాజ్ కుమార్ నటన అద్భుతమని చెప్పాలి. ఒక క్రిమినల్ ని ఏ విధంగా పట్టుకోవాలో ఒక క్రిమినల్ మైండ్ గల పోలీసు ఎలా ఆలోచిస్తాడో వర్మ శివరాజ్ కుమార్ రూపంలో చాలా చక్కగా చూపించాడు. వీరప్పన్ ని సినిమాలో హైలైట్ చేయకుండా అతన్ని ఎలా చంపారు అనేదే సినిమాలో చూపడం సరిగా అనిపించదు. వీరప్పన్ గురించి చెబుతున్నప్పుడు అతని గురించి, ఆటను అంతలా పోలీసులకి టార్గెట్ అవ్వడానికి రీజన్స్ ని డెవలప్ చేయాలి కానీ ఇందులో సింపుల్ గా అతను ఇలా చేసాడు అని చెప్పేసి అతన్ని చంపిన పార్ట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అందువల్లే సినిమా అంత ఎంగేజింగ్ గా లేదు. కథ పరంగా వీరప్పన్ లైఫ్ లోని చివరి ప్లాట్ ని తీసుకున్నాడు. అదే దాన్ని చెప్పాడు. ఇక ‘రక్తచరిత్ర’ వంటి చిత్రం తర్వాత వర్మ ఆ స్థాయిలో ‘కిల్లింగ్ వీరప్పన్’ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. వర్మ దర్శకత్వం, శివరాజ్ కుమార్ మరియు సందీప్ ల నటన కోసం చిత్రాన్ని ప్రేక్షకులు ధియేటర్ కి వెళ్లి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. రామ్ గోపాల్ వర్మ ఈ వీరప్పన్ స్టొరీని కేవలం శివరాజ్ కుమార్ అనే పోలీస్ యాంగిల్ లో మాత్రమే చూపించారు. వీరప్పన్ గా నటించిన ఢిల్లీ నటుడు సందీప్ భరద్వాజ్ తన లుక్ తో పాటు ఎక్స్ ప్రేషన్స్ తో వీరప్పన్ పాత్రకి ప్రాణం పోసాడు. తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. సందీప్ ని ఎంచున్నప్పుడే వర్మ సగం సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించిన యాగ్నా శెట్టి, మరో ముఖ్యపాత్రలో నటించిన పరుల్ యాదవ్ నటనతో తమ పాత్రలకు న్యాయం చేసారు.ఐతే వర్మ టేకింగ్ తో కనెక్టయితేనే మాత్రం సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది.

నటీనటుల పని తీరు:

శివరాజ్ కుమార్ : పోలీస్ ఆఫీసర్ కన్నన్ పాత్రలో శివరాజ్ కుమార్ అద్భుతమైన నటనని కనబరిచాడు.

సందీప్ భరద్వాజ్: ఇక వీరప్పన్ అంటే ఇలానే ఉంటాడేమో అనేలా సందీప్ భరద్వాజ్ నటనని కనబదిచాడు. విలనిజం చూపించే కొన్ని సీన్స్ మరియు తన లవ్ ప్రపోజ్ హ్సుసే సీన్స్ లో వావ్ అనిపించాడు.

వీరప్పన్ భార్య పాత్రలో యజ్ఞ శెట్టి చాలా బాగా చేసింది. ఇక పరుల్ యాదవ్, రాజేష్ తదితరులు తమతమ పాత్రల్లో బాగానే చేసారు.

సాంకేతిక వర్గం పనితీరు:

డైరెక్టర్ గా పెర్ఫార్మన్స్ తీసుకోవడంలో కొన్ని సీన్స్ బాగా తీసినా చాలా లాజిక్స్ ని వదిలేసాడు. మెయిన్ గా అసలు పోలీస్ ఎందుకు అంతలా వీరప్పన్ ని చంపాలనుకున్నాడు, అసలు పరుల్ యాదవ్ ఎవరు అసలు ఈ కథలోకి ఎందుకు వచ్చింది, అలాగే అసలు వీరప్పన్ కి బయటనుంచి సపోర్ట్ అనేదే లేకుండా చివర్లో చూపించిన పాయింట్ లలో అస్సలు లాజిక్ అనేదే లేదు.. కానీ ఇవే సినిమాకి చాలా కీలకం. కానీ మిస్ చేసేసాడు. వర్మ వీరప్పన్ చూపించిన విధానం, ఆపరేషన్ కుకున్ ని తెరకెక్కించిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్ కెమెరా వర్క్..ఫారెస్ట్ లో కెమెరాని ఉపయోగించిన విశానం, చేజింగ్ లని తీసిన విశానం సూపర్బ్..

సంగీతం -రవిశంకర్, మున్నాకాశి, రాజశేఖర్, సునీల్ కశ్యప్, సాండీ :- సాండీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవ్వాలి కానీ సినిమాకి అస్సలు హెల్ప్ అవ్వలేదు. ఇక మిగతా నలుగురు కంపోజ్ చేసిన పాటలు కూడా ఎప్పటి వర్మ సినిమాల్లో లానే ఉన్నాయి.

ఆర్ట్–రఘు కులకర్ణి :– గుడ్.. సినిమా కోసం ఎంచుకున్న లొకేషన్స్మ, కథకోసం తను సెట్ చేసిన కొన్ని సెటప్స్ బాగున్నాయి.
ఎడిటింగ్ – అన్వర్ అలీ :– సినిమాలో డైలాగ్స్ కి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి హావ భావాలతోనే కథని నడిపించాడు. దాని వలన ఎడిటింగ్ లో ఎక్కువ లేపేయడానికి వీలులేకపోయింది. దాని వలన సినిమా అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:

  • సినిమా ఇంట్రడక్షన్
  • వీరప్పన్ ఎలివేషన్ సీన్స్
  • ఇంటర్వెల్ – క్లైమాక్స్ బ్లాక్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • వీరప్పన్ గురించి చెప్పకపోవడం
  • స్క్రీన్ ప్లే
  • సాగదీసిన రన్ టైం

అలజడి రేటింగ్: 3/5

  పంచ్ లైన్: వర్మ టేకింగ్ తో ప్రేక్షకులను కిల్లింగ్ చేశాడు.

(Visited 687 times, 1 visits today)