Home / Inspiring Stories / హమారా హైదరాబాద్….!

హమారా హైదరాబాద్….!

Author:

రోజుకో రకంగా కొత్త కొత్తగా అలంకరించుకునే హైదరాబాద్ ఆదివారం వచ్చిందంటే ఫుట్ పాత్ ల నిండా అపార విఙ్ఞానాన్ని పరుస్తుంది. వందల మంది రచయితలు, వేలాది కాదు కాదు లక్షలాది పుస్తకాలు అలా నేల మీదికో ఆకాశాన్ని తెచ్చి తీరిగ్గా చూస్తుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు పిచ్చి వాళ్ళలా అబిడ్స్, నాంపల్లి, కోటీ రోడ్ల మీదికి పరుగులెత్తే మనుషులు కోకొల్లలు… ఆ మార్కెట్ సమాచారమే ఈవారం
హమారా హైదరాబాద్ లో..

హమారా హైదరాబాద్ hamara Hyderabad.

సార్..! ఏం పుస్తకాలు కావాలె ఇంజినీరింగా? ఇగో ఇక్కడున్నయ్..! ఎలక్ట్రానిక్స్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ ఐతే ఈ ఆథర్ బుక్ చూడండి భాయి.. కెన్నెడీ’స్  ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టంస్ బై జార్జ్ కెన్నెడీ అంద్ బ్రెండన్ డేవిస్ ది ఐతే బాగుంటది. పదో తరగతి చదివే అస్లం మీకు ఎలక్ట్రానిక్స్ లో ఉండే ఏ పుస్తకం గురించైనా మీకు సరైన సమాచారాన్ని అందిస్తాడు..

హమారా హైదరాబాద్ hamara hyderabad

ఇంకో రెండడుగులు ముందుకేస్తే చెక్క ఆల్మెరా పై బొమ్మల కొలువులా హోమర్ నుంచీ శ్రీనాథుని వరకూ, ఫ్రాయిడ్ నుంచీ మార్క్స్ వరకూ ఏది కావాలన్నా… ఇదీ అదీ అని ఏం లేదు పక్కపక్కనే రంగనాయకమ్మ గారి విషవృక్షమూ, ఆంధ్ర మహా భారతమూ కనిపించినపుడు కాస్త నవ్వురాక మానదు.

హమారా హైదరాబాద్ hamara hyderabad

పొద్దున 7 గంటలకల్లా ఈ పుస్తకాల మార్కెట్ లు సిద్దమై పోతాయ్ ఆటోళ్ళోనూ,రిక్షాల్లోనూ వచ్చిన పుస్తకాలని ఫుత్ పాత్ పైనా అక్కడే ఉన్నాషాపుల గోడలకీ ఆనించి నిలబెడతారు. కొన్ని పుస్తకాలని కుప్పగా పోసి  ఒక్కోటీ 100,50 ఇలా బోర్డు పెడతారు దాదాపుగా లా కుప్పలో పుస్తకాలన్నీ కాస్త ఇంగ్లిష్ చవక బారు సాహిత్యాన్ని కలిగి ఉంటాయి.లేదంటే పిల్లల కామిక్ బుక్స్ ఐనా.. ఫుట్ పాత్ మీదే

హమారా హైదరాబాద్ hamara hyderabad

కొత్త విధ్యా సంవత్సరం మొదలైతే చాలు పేద విధ్యార్తుల తల్లిదండ్రుల కాళ్ళు మొదట గా దారి తీసేది ఈ ఫుట్ పాత్ షాపులవైపే కోటీ చౌరస్తాలో ఉండే ఫుట్ పాత్ మార్కెట్ పేద విధ్యార్ర్థుల పాలిటి వరమనే

హమారా హైదరాబాద్ hamara hyderabad

చిన్నప్పుడేపుదో చదువుకున్న సోవియట్ పుస్తకాలూ, చందమామ, బాలమిత్ర, స్వాతి, స్టార్ డస్ట్ లాంటి పాత మ్యాగజైన్ లూ,ఇక్కడే కనిపిస్తాయ్.ఇతర దేశాల సాహిత్యమూ ఉంటుంది ఒకరకంగా చెప్పాలీ అంటీ ఆదివారం హయ్దరాబాద్ ఫుట్ పాత్ లు ప్రపంచ సాహిత్యానికి వేదికగా నిలుస్తాయి..

హమారా హైదరాబాద్ hamara hyderabad

ఎన్నోఏళ్ళుగా మీరు వెతికే పుస్తకం ఎన్ని పుస్తకాల షాపుల్లోనో వెతికీ వెతికీ అలసిపోయి ఇక దొరకదు అని నిర్ణయించేసుకున్నాక… ఒక్కో సారి ఈ పుట్పాత్ పైనే కనిపిస్తుంది. ఐతే ఈ పుస్తకాలన్నీ కేవలం సెకెండ్ హాండ్ వి మాత్రమే అనుకుంటే పొరపాతే కొత్త పుస్తకాలనూ ఇక్కడ అమ్మేస్తూంటారు. పెద్ద పెద్ద పుస్తకాల షాపులు తీసుకో నిరాకరించిన పుస్తకాలను కూడా ఇక్కడ అమ్మిస్తూంటారు పబ్లిషర్లూ రచైతలూ…

హమారా హైదరాబాద్ hamara hyderabad

ఒక పుస్తకం కాపీ మీద 500/- ఉంటే మీరు సరిగ్గా బేరమాడగలిగితే ఆ పుస్తకాన్ని మీరు 100 రూపాయలకే పొందొచ్చు. లేదా 30/-పుస్తకం మీరు 50 ఇస్తా ఆన్న అమ్మకపోవచ్చు. మీరొక పుస్తకాన్ని చూసి ఇచ్చే ఎక్స్ ప్రెషన్ ని బట్టే మీకా పుస్తకం అవసరాన్నీ, దాని ధర నీ నిర్ణయించేస్తారు ఇక్కడి పుస్తక వ్యాపారులు..

హమారా హైదరాబాద్ hamara hyderabad

కొన్ని సార్లు మీ దగ్గరున్న పుస్తకాన్ని ని ఒక మిత్రుడు చదివిస్తాను అని తీసుకెళ్తాడు  మీరు కొన్నాళ్ళకి ఆ పుస్తకాన్ని గురించే మర్చిపోతారు.ఒక రోజు హఠాత్తుగ ఆ పుస్తకం మీకు ఈ పుట్ పాత్ మీద మీ పేరుతో సహా కనిపిస్తుంది. కొన్ని సార్లు మీరు ఇంకెవరికో బహుమతిగా ఇచ్చిన పుస్తకమూ ఇక్కడే కనిపించొచ్చు..

హమారా హైదరాబాద్ hamara hyderabad
ఎన్ని పుస్తకాలు కొన్నా,ఎన్ని బుక్ ఫెయిర్ లు తిరిగినా దొరకని పుస్తకాలు ఒక్క ఆదివారం పూట రోడ్డు మీదకే వచ్చి చేరి పోతాయి. మీ కోసం ఎదురు చూస్తూంటాయి… మీకు పుస్తకాలు చదివే అలవాటు లేకున్నా సరే ఏదైనా ఒక ఆదివారం అలా అబీడ్స్ వైపో నాంపల్లి వైపో లేదా ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపుకో వెళ్ళండి… పుస్తకాలని చూడటమూ మీకు ఎంత ఆనందాన్నిస్తుందో ఎన్ని చిన్ననాటి ఙ్ఞాపకాలని గుర్తుకు తెస్తుందో చూడండి… ఒక చందమామ నో ఏ బాలమిత్రనో లేదూ ఇంకో కామిక్ పుస్తకమో నాన్న ఒళ్ళో కూచుని కూడబలుక్కుంటూ చదివిన రోజుని మళ్ళీ మీకందించొచ్చు….

హమారా హైదరాబాద్ hamara hyderabad

(Visited 138 times, 1 visits today)