Home / Entertainment / కిట్టూ తో మరో హిట్టు కొట్టనున్న రాజ్ తరుణ్?

కిట్టూ తో మరో హిట్టు కొట్టనున్న రాజ్ తరుణ్?

Author:

తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో రాజ్ తరుణ్.. తర్వాత వరసగా హిట్స్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాడు. ఆ తర్వాత ఓ ప్లాప్ వచ్చినప్పటికీ, మంచు విష్ణుతో కలిసి ఈడోరకం ఆడోరకం సినిమాతో మళ్లీ హిట్ బాట పట్టాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అంటూ ఓ కామెడీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్యే సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో రాజ్ తరుణ్ కుక్కలను కిడ్నాపింగ్ చేసే కుర్రాడిగా కనిపించాడు.

raj tarun kisses to nani lover

అను ఇమాన్యుయేల్ మొదటి సినిమా మజ్ను. ఈ చిత్రంలో నాని అను ని ప్రేమించిన తీరు ప్రతీ సినిమా ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఇటీవల రిలీజ్ అయినా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ట్రైలర్ లో, ఈ హీరోయిన్, రాజ్ తరుణ్..ల లిప్ లాక్ సీన్ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అలాగే, కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బులడగటానికి సిగ్గులేదా?.. అని ఓ కేరక్టర్ ప్రశ్నిస్తే.. ‘మరి మిమ్మల్ని కిడ్నాప్ చేసి కుక్కల్ని డబ్బులు అడగలేం కదండీ’ అంటూ వేసిన పంచ్ తోనే.. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్ధం అవుతుంది. ఇక కౌబాయ్ టైపులో.. భౌ బాయ్ అనే పద ప్రయోగం కూడా అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే హంసానందిని ఐటెంసాంగ్ తో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కిట్టు మళ్లీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు అన్నమాట.

(Visited 418 times, 1 visits today)