Home / Political / ఈ ఏడాది చివరిలోగా మార్కెట్ లోకి రానున్న పర్సనల్ ఫ్లైయింగ్ మెషీన్.

ఈ ఏడాది చివరిలోగా మార్కెట్ లోకి రానున్న పర్సనల్ ఫ్లైయింగ్ మెషీన్.

Author:

హాలీవుడ్ సినిమాలలో ఎగిరే కార్లు, వింత వింత ఫ్లైయింగ్ మెషీన్లను చూస్తూనే ఉంటాం, కాని రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతతో అవన్ని తొందరలోనే నిజంగా మన ముందుకు రానున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న కిటీ హాక్ అనే స్టార్ట‌ప్ కంపెనీ తొలిసారిగా ప్రయాణానికి అనుకువగా ఉండే పర్సనల్ ఫ్లైయింగ్ మెషీన్ కి సంబంధించిన తొలి న‌మూనాను విడుద‌ల చేసింది. అంతే గాక త్వ‌ర‌లోనే మార్కెట్లోకి ఈ పర్సనల్ ఫ్లైయింగ్ మెషీన్ లు వ‌స్తాయ‌ని తెలిపింది. ఆ పర్సనల్ ఫ్లైయింగ్ మెషీన్ తొలి వీడియోను క్రింద చూడండి.

రోటార్ల సాయంతో ఎగిరే డ్రోన్లలో వాడే టెక్నాలజి తో తయారు చేసిన ఈ ఈ ఫ్లయింగ్ కారు 8 రోటార్ల స‌హాయంతో ప‌నిచేస్తుంది. కేవ‌లం 100కిలోల బ‌రువుండే ఈ వెహిక‌ల్ 15 అడుగుల ఎత్తులో ఎగురుతూ గంటకు 40 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. టేకాఫ్, ల్యాండింగ్‌లు సులభంగా చేసుకోవచ్చు. అంతే కాకుండా వీటిని నడపడానికి పైలెట్ లైసెన్స్ అక్క‌ర్లేదు, కేవ‌లం రెండు గంట‌ల‌పాటు ట్రైనింగ్ తీసుకుంటే చాలు. దీనిపై అన్ని ప‌రీక్ష‌లు పూర్తయ్యాయని ప్రకటించిన కిటీహాక్ సంస్థ ఈ ఏడాది చివరలోగా ఈ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఇంకా ధర నిర్ణయించని ఈ ఫ్ల‌యింగ్ కార్ మార్కెట్ లోకి రాగానే 100 డాల‌ర్లు చెల్లించి ముందస్తూ స‌భ్య‌త్వం పొందిన‌వారికి ఇస్తారట. త్వరలోనే సొంత వాహనంలో ఎగిరిపోవాలనే మనుషుల కల తీరిపోవాలని ఆశిద్దాం.

(Visited 183 times, 1 visits today)