Home / Latest Alajadi / ప్రపంచంలోనే ఒక వింత..! కదిలే శివలింగం..! ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు…!

ప్రపంచంలోనే ఒక వింత..! కదిలే శివలింగం..! ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు…!

Author:

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. ఇందులో లయ కారకుడైన పరమేశ్వరుడు అనే విషయం మనకు తెలిసిందే. మన దేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయి. అందులో ఎక్కువగా మనకు కనిపించే దేవాలయాలు శివుడివి. ఎందుకంటే మనకు పురాణాల ప్రకారం శివుడు మొదటి దేవుడు. ఇక హిందువుల ఆరాధ్య దైవం కూడా శివుడు కావడం విశేషం. శివమ్ అంటే శుభం అని, లింగం అంటే సంకేతం అని అర్ధం. మొత్తానికి శివలింగం అంటే శుభానికి సంకేతం. ఈ ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉన్నాయి. అందులో కొన్ని మనుషులు ప్రతిష్టించినవి మరి కొన్ని వాటంతట అవే వెలిసినవి…. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే శివలింగం మాత్రం చాలా ప్రత్యేకమైనది… ఎందుకంటే ఇలాంటి విషయం మీరు ఇది వరకు విని ఉండరు, చూసి ఉండరు. మరి ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటో తెలుసా! ఈ శివలింగం కదులుతుంది… అదేంటి శివలింగం కదులుతుందా! అని అనుకుంటున్నారా కానీ నిజం… కావాలంటే మీరు ఒకసారి చూడండి.

shiv-mandir-1

ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలోని రుద్రాపురం అనే గ్రామం అనేక కట్టడాలకు ప్రసిద్ధి కానీ అందులో ప్రత్యేకత మాత్రం దుగ్దేశ్వరనాథుడి దేవాలయం. ఎందుకంటే ఇందులో కొలువైన శివుడు కదులుతుంటాడు. ఇలా కదలడం మొదలుపెడితే ఒక్కోసారి గంట నుండి 24 గంటలు కదులుతుంది. కానీ ఒక్కసారి ఆగిపోయిన తరవాత ఎంత కదిపినా కదులదు అదే ఇక్కడి ప్రత్యేకత. చాలా దేవాలయాలలో శివలింగంలా పానమత్తము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠబడింది. రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం ఎన్నో సందర్భాలలో కదలడం చాలా ప్రత్యేకత.. ఈ సంఘటనను చూడటానికి భక్తులు తండోప తండాలుగా తరలివస్తుంటారు ఇక్కడికి. ఈ చిత్రమైన సంఘటనను ఎలాగైనా కనిపెట్టాలని శాస్త్రవేత్తలు శివలింగం చుట్టూ ఎంత తవ్విన దాని జాడ తెలియడం లేదట! దానితో ఇక్కడ సాక్షాత్తు పరమ శివుడే వెలిశాడని భక్తుల నమ్మకం. వీలుంటే మీరు ఒకసారి చూసిరండి.

(Visited 20,448 times, 1 visits today)