Home / Latest Alajadi / వంట గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ప్రమాద బీమా వస్తుంది…!

వంట గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ప్రమాద బీమా వస్తుంది…!

Author:

LPG(వంటకు వినియోగించే గ్యాస్) ఒకప్పుడు ధనిక వర్గం వారే ఉపయోగించేవారు. గత కొద్దీ రోజులుగా ప్రభుత్వాలు పేద ప్రజలకు కూడా గ్యాస్ అందించాలని చాలా విస్తృత ప్రచారంతో గ్రామలలో కూడా చాలా వరకు గ్యాస్ కనెక్షన్ కలిగినవారు ఉన్నారు. వినియోగదారులు ఎక్కువ కావడంతో దురదృష్ట సంఘటన జరిగితే వారికి కేంద్రప్రభుత్వం బీమారక్షణ కలిపించాలని నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వలన ఏదైనా దురదృష్టమైన సంఘటన జరిగితే లిఖిత పూర్వకంగా గ్యాస్ డీలర్ కు తెలియజేయాలి. ఈ విషయాన్నీ వారు సంబంధింత ప్రాంతీయ కార్యాలయానికి, బీమా కంపెనికి తెలియజేస్తారు. ప్రమాదం కారణంగా తలెత్తే బీమా క్లెయిమ్ లకు చేయవలసిన పనులన్నింటిని పూర్తీ సహకారం అందించడానికి ఆయిల్ కార్పొరేషన్లు ముందుకు వచ్చాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే బీమాని పొందడానికి ఎటువంటి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులందరికి ఉచితంగా బీమా వర్తిస్తుంది.

know-about-gas-cylinder-insurence

పబ్లిక్ లయబిలిటీ బీమా పాలసీ ఏవిధంగా వర్తిస్తుందో చూద్దాం :

  • గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో ఏదైనా ప్రాణ నష్టం జరిగితే గరిష్టంగా రూ.40 లక్షల వరకు బీమా ఉంటుంది. బీమా ఎంత చెల్లించాలో మరణించిన వ్యక్తి వయస్సు, ఉద్యోగం మరియు కుటుంబ పరిస్థితులని బట్టి నిర్ణయిస్తుంది.
  • ప్రతి వ్యక్తికి రూ.6 లక్షల వ్యక్తిగత బీమా రక్షణ ఉంటుంది.
  • ఘటనలో గాయపడిన వారికి రూ. 15 లక్షల వరకు వైద్య ఖర్చులు, గాయపడిన వ్యక్తికీ గరిష్టంగా 1 లక్షల వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద 25 వేల వరకు అందిస్తారు.
  • అధీకృత డీలర్ రిజిస్టర్ స్థలంలో అత్యధికంగా రూ 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగితే పరిహారం చెల్లిస్తారు. కాకపొతే ఇందులో కొన్ని నిబంధనలు,షరతులు వర్తిస్తాయి.

ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే ప్రమాద బీమాని పొందాలంటే ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత గ్యాస్ డీలర్ కి సమాచారం ఇవ్వాలి, బీమాకి కావాల్సిన పేపర్స్ ని అందజేయాలి. గ్యాస్ ప్రమాద బీమాలో గ్యాస్ కంపెనీ బీమాతో పాటు థర్డ్-పార్టీ కంపెనీ బీమా కూడా ఉంటుంది.బీమా కంపెనీ వాళ్ళు విచారణ చేసి బీమా డబ్బులని బాధితులకి అందిస్తారు.

గ్యాస్ వినియోగ దారులు తీసుకోవలసిన జాగ్రత్తలు :

  • రెగ్యులేటర్ ని వంట ముగిసిన తరువాత ఆఫ్ చేయాలి.
  • ఐఎస్ఐ మార్కు కలిగిన స్టౌ, గ్యాస్ పైప్ లను వాడాలి. వీటిని రెండు సంవత్సరాలకి ఒక్కసారి మార్చాలి.
  • గాలి బాగా వీచే ప్రదేశాలలో గ్యాస్ స్టౌ ఉంచరాదు.
  • లైటర్ వెలిగించిన తరవాతనే గ్యాస్ ఆన్ చేయాలి.
  • సిలిండర్ ని ఎప్పుడు నిటారుగా ఉంచాలి. గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎక్కువ ఎత్తులో ఉంచాలి.
  • వంటగదిలో రిఫ్రిజిరేటర్, వెలుగుతున్న దీపం, కొవ్వొత్తులు ఉంచారాదు.
  • గ్యాస్ ట్యూబ్ ని స్టౌ కి రెగ్యులేటర్ బిగించే సమయంలో చాలా మంది కొవ్వొత్తి లాంటివి వెలిగించి వ్యాస్ లీక్ అవుతుందా లేదా అని చూస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు. మీకు లీక్ అవుతుందని అనుమానం వస్తే నీటిని మాత్రమే వినియోగించాలి.

గ్యాస్ ప్రమాదం జరిగితే బాధితులకి బీమా సౌకర్యం ఉంటుందని చాలా మందికి తెలియదు, దురదృష్టవశాత్తు గ్యాస్‌ ప్రమాదాలు జరిగితే టోల్‌ ఫ్రీ సంఖ్య 18002333555 లేదా 1906 కి ఫోన్ చేయాలి.

(Visited 2,526 times, 1 visits today)