Home / General / హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!

హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!

Author:

చిన్న రోగంతో హాస్పిటల్ కి వెళ్తే లక్షల్లో బిల్లులు కట్టించే కాలం నడుస్తుంది, వచ్చిన రోగం గురుంచి కంటే హాస్పిటల్ బిల్లు గురుంచే ఎక్కువ టెన్షన్ పడే పరిస్థితి మనదేశంలో నెలకొంది, ఇంకా కాన్సర్ లాంటి మహమ్మారి రోగాల వస్తే ట్రీట్ మెంట్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిందే, డబ్బులున్న వారు ఎంతైనా పెట్టి ట్రీట్ మెంట్ చేయించుకుంటారు కానీ పేద, మధ్య తరగతి ప్రజలే వచ్చిన రోగాలకు ట్రీట్ మెంట్ చేయించుకునే స్థోమత లేక చావుకి సిద్దపడిపోతున్నారు.

క్యాన్సర్ వచ్చిందంటే ఖచ్చితంగా చావుకి దగ్గరైనట్టే, దానికి ఖర్చు కూడా సామాన్య ప్రజలు భరించలేని విధంగా ఉంటుంది, అలాంటి క్యాన్సర్ రోగాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ట్రీట్ మెంట్ చేస్తుంది హైదరాబాద్ లోని MNJ ఇనిస్టిట్యూట్ అఫ్ ఆంకాలజీ హాస్పిటల్.

హైదరాబాద్ లోని ఆ హాస్పిటల్ లో 7-11 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..! వివరాలు ఇవే..!

సాధారణంగా క్యాన్సర్ వ్యాధి వచ్చినపుడూ శరీరంలోని ఆ భాగాన్ని తొలగించాల్సి వస్తుంది, ఉదాహరణకు ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు దెబ్బతిన్న బ్రెస్ట్ ని తీసెస్తారు కదా. అలాగే క్యాన్సర్ చికిత్సతో పాటుగా క్యాన్సర్ వల్ల తల నుంచి పాదం వరకూ శరీరంలోని ఏ అవయవానికి క్యాన్సర్‌ సోకిన భాగాన్ని తొలగించాల్సి వచ్చిన వాటన్నింటింకి వియజయవంతంగా శస్త్ర చికిత్స చేయడంలో ఈ ఆసుపత్రి వైద్యులు నిష్ణాతులు.

హైదరాబాద్ లోని ఆ హాస్పిటల్ లో 7-11 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..! వివరాలు ఇవే..!

ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ క్యాన్సర్ శస్త్ర చికిత్సలను ఉచితంగా చేస్తూ సామాన్య ప్రజలకు పునర్జన్మ ప్రసాదిస్తుంది MNJ క్యాన్సర్‌ హాస్పటల్, దేశం లోని పెద్దపెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా ఇప్పటి వరకూ చేయనీ, చేయలేని క్యాన్సర్‌ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలనూ ఇక్కడ ఉండే డాక్టర్లూ, వైద్యనిపుణులు సాధ్యం చేసి చూపిస్తున్నారు.క్యాన్సర్‌ కారణంగా తొలగించిన అవయవాలను పునర్నిర్మించే చికిత్సలకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రూ.7-11 లక్షల వరకూ ఖర్చవుతుండగా ఎంఎన్‌జేలో ఉచితంగానే చేస్తున్నారు.గత పదేళ్లలో నాలుగువేలకు పైగా పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు చేయగా అందులో 92 శాతం మంది నిరుపేదలే కావడం ఆసుపత్రి అందిస్తోన్న విశిష్ట సేవలకు నిదర్శనం

(Visited 1,441 times, 1 visits today)