Home / Inspiring Stories / సైన్స్ కే అంతుపట్టని మిస్టరీ బాబా…! 70 ఏళ్ళుగా ఆహారం, నీరు తీసుకోకుండా బతుకుతున్నాడు….!

సైన్స్ కే అంతుపట్టని మిస్టరీ బాబా…! 70 ఏళ్ళుగా ఆహారం, నీరు తీసుకోకుండా బతుకుతున్నాడు….!

Author:

ఉదయం టిఫిన్ తినకుండా బయటికి వెళితే మధ్యాహ్నం వరకే కడుపులోని పేగులు ఆకలితో కేకలు వేస్తుంటాయి. ఆహారం లేకుండా ఒక్క పూట ఉండటమే కష్టం కానీ ఒకవ్యక్తి గత 70 సంవత్సరాలుగా ఎలాంటి ఆహారం లేకుండా కనీసం పచ్చి మంచి నీళ్లు లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తన దరిచేరకుండా బ్రతుకుతున్నాడు. ఆయన పేరు ప్రహ్లాద జని. ప్రజలంతా మాతాజీ అని పిలుస్తారు. కొంత మంది భక్తులు చుందాదివాలా మాతాజీ అని కూడా పిలుస్తారు. ఇతను ఒక సాధువు, అంబ దేవతను పూజిస్తూ, దేవత ధ్యానంలోనే ఉంటాడు…. మనిషి అనేవారు కచ్చితంగా ఆహారం,నీరు లేకుండా బ్రతకలేరు అనే కదా మీ డౌట్….. ఇలాంటి వాటిని అక్కడున్న ప్రజలు కూడా మొదట్లో ఎవరు నమ్మలేదు చివరకు మాతాజీకి ఎన్నో పరీక్షలు పెట్టి వారు విఫలం అయ్యారు. ఈ మాతాజీ ప్రస్తుతం గుజరాత్ లోని చారద అనే గ్రామంలో ఉంటున్నారు.

prahlada-jani-baba

అంబ దేవత సేవలో :
అక్కడి గ్రామస్తుల కథనాల ప్రకారం మాతాజీ తన ఏడేళ్ల వయసులో రాజస్థాన్ లో ఉన్న తన ఇంటి నుండి పారిపోయి అడవులలో జీవించేవాడట. కొద్దీ రోజులు గడిచిన తర్వాత తన 11 వ యేటా అడవిలో ఉండే ఒక గుడిలోని అంబ దేవతను భక్తి శ్రద్దలతో పూజించడం మొదలుపెట్టాడు . అలా దేవత ధ్యానంలో ఉంటూ అంబ దేవతలాగే వస్త్రాలను అలంకరించుకునేవాడట. ఎర్రచీర, ఆభరణాలను ధరించి, జుట్టును పెంచుకొని, జుట్టుకు పూలు పెట్టుకునేవాడట… పూర్తిగా అమ్మవారి అలంకరణలో అమ్మవారిగా మారిపోయాడు మాతాజీ.

ఆకలితో ఉన్న సమయంలో అంబ దేవత ఆకలి తీర్చేది:
ప్రహ్లాద జని ఎప్పుడైతే అమ్మవారిని గాఢంగా నమ్ముకుంటూ వచ్చాడో తన ఆకలిని కూడా అమ్మవారే తీరుస్తుంది అని నమ్మేవారు. తనకు ఆకలిగా ఉన్నప్పుడు అంబ దేవత తన అంగడి( నుదిటి) పై నీటి బిందువులను జారవిడిచి ఆకలి తీర్చేదట. 1970లో గుజరాత్ లోని అడవిలో గల అంబాజీ ఆలయంలోనే ప్రహ్లాద జని నివసించేవాడు. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకే నిద్ర లేచి తలా స్నానం చేసి, పూజలు పూర్తిచేసి అంబదేవత ధ్యానంలో ఉంటూ దేవతను ఆరాధించేవాడు….

మొదటిసారి 2003లో మాతాజీ పై పరిశోధనలు :
చాలా సంవత్సరాలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా జీవిస్తున్న ప్రహ్లాద జని గురించి ఆనోటా ఈనోటా అక్కడ ఉండే చుట్టుపక్కలవారికి తెలిసింది. దానితో 2003 లో డాక్టర్ సుధీర్ షా పర్యవేక్షణలో, స్టెర్లింగ్ హాస్పిటల్ లో అయన పై ఉన్న అనుమానంతో ఒక గదిలో 10 రోజులపాటు ఉంచారు. ఈ పదిరోజుల్లో ఎక్కడ కదలకుండా,మలమూత్ర విసర్జన కూడా చేయకుండా ఉన్నాడు. కానీ ఈ పది రోజుల్లో ప్రహ్లాద జని బరువు కొద్దిగా తగ్గిందని వైద్యులు తెలిపారు. దానితో ఆహారం తీసుకోకపోవడం వలనే కొద్దిగా బరువు తగ్గారని వారికి కొద్దిలో అనుమానం ఉండేది….

2010 లో మరోసారి మాతాజీ పై పరిశోదన :
2003లో ఉన్న అనుమానాలను ఈసారి ఎలాగైనా తొలగించుకోవాలి అని 2010 లో అదే డాక్టర్ సుధీర్ షా తో పాటు మరో 35 మంది డాక్టర్స్ ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫిజియాలజీ మరియు లాయిడ్ ఆర్గనైజేషన్ తో పాటు కొన్ని సంస్థలు కలసి మాతాజీ ని 2010 ఏప్రిల్ 22 నుండి మే 6 వరకు ఒక గదిలో ఉంచి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి రోజు బ్లడ్ టెస్ట్, స్కానింగ్…. ఇలా చాల రకాల పరీక్షలు జరిపారు. ఈ 15 రోజుల్లో ఒక్క రోజు కూడా టాయిలెట్ కు కూడా వెళ్ళలేదు అలాగే మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని వచ్చాయి…..

(Visited 8,397 times, 1 visits today)