Home / Latest Alajadi / ఉల్లిపాయతో ఇలా ఒక్కసారి చేసి చూడండి. అద్భుతమైన ప్రయోజనాలని పొందుతారు.

ఉల్లిపాయతో ఇలా ఒక్కసారి చేసి చూడండి. అద్భుతమైన ప్రయోజనాలని పొందుతారు.

Author:

తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు మన పెద్దవారు. ఉల్లి మనకు ఆరోగ్యమే కాదు అందం ఇస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరానికి అంతటా సరఫరా చేస్తుంది. ఇలా రక్తం అన్ని భాగాలకు సరఫరా చేరడం వలన ఆరోగ్యంతో పాటు చర్మం కూడా కాంతి వంతంగా తయారు అవుతుంది. మనకు ముఖంలో కాంతి కావాలంటే ఉల్లిపాయను ఈ విధంగా వాడితే సరిపోతుంది.

onion-benefits

ఉల్లిపాయను ముఖానికి ఈ విధంగా వాడాలి :

  • ఒక చిన్న పాత్రలో 2 స్పూన్ల శనగపిండి
  • రెండు స్పూన్ల ఉల్లిపాయ రసం
  • చిటికెడు జాజికాయ పొడి
  • కొన్ని చుక్కల లావెన్డేరు నూనె ( మనకు ఆయుర్వేదిక్ షాప్ లలో దొరుకుంటుంది)ను వేసి బాగా కలపాలి.
  • ముకానికి రాసి 20-25 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
  • ఈ విధంగా రెండు వారాలు చేస్తే ముఖం కాంతి వంతంగా అవుతుంది.

ఉల్లిపాయతో నల్ల మచ్చలు పోవాలంటే :
ఒక పాత్రలో ఉల్లిరసం, పెరుగు సమానంగా తీసుకోని కలిపి ముఖానికి రాసుకోవాలి. 5-10 నిమిషాల పాటు నల్ల మచ్చలు ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా ఒక్క పది రోజులు చేస్తే నల్ల మచ్చలు ముఖంపై కనిపించవు.

(Visited 6,420 times, 1 visits today)