Home / Inspiring Stories / ఇకనుండి 3D ప్రింటర్ ద్వారా ఇల్లులు కూడా ప్రింట్ చేసుకోవచ్చు.

ఇకనుండి 3D ప్రింటర్ ద్వారా ఇల్లులు కూడా ప్రింట్ చేసుకోవచ్చు.

Author:

“ఇల్లు కట్టిచూడు- పెళ్ళి చేసి చూడు” అనేది ఆ రెండు పనులు ఎంత కష్టతరమైనవో తెలిపే సామెత. కాని ఇల్లు కట్టాలంటే మీరేం కష్టపడాల్సిన అవసరం లేదంటుంది అమెరికా కు చెందిన ఏపిస్ కోర్ అనే కంపనీ. వారు తయారు చేసిన 3D ప్రింటర్ తో 24 గంటలలోనే మీకు కావాల్సిన విధంగా మీ ఇంటిని ప్రింట్ చేసి ఇస్తారట. ప్రింట్ అనగానే అదేదో కాగితం ఇల్లు అనుకోకండి వారు చెప్పేదీ నిజంగానే కాంక్రీట్ తో కట్టిన ఇల్లు…సారీ కాంక్రీట్ తో ప్రింట్ తీసిన ఇల్లు. నమ్మశఖ్యంగా లేదా అయితే ఈ కింది వీడియో ను ఒకసారి చూడండి.

ఏపిస్ కోర్ కంపనీ వారి ప్రకటన ప్రకారం 3D ప్రింటింగ్ ఇంటికి చాల తక్కువ ఖర్చు అవుతందట.. వారు పైన వీడియో లో చూపించిన ఇంటి నిర్మాణానికి కేవలం 10000 అమెరికన్ డాలర్లు ఖర్చు అయ్యిందట, అంతే కాకుండా ఆ ప్రింటర్ ని ఒక గంటలోనే సెటప్ చేసి పని ప్రారంభించి 24 గంటలలో పూర్తి చేసారు. ఇలా నిర్మించిన ఈ ఇల్లు 175 సంవత్సారాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని ప్రకటించింది ఆ కంపనీ. ప్రస్తుతం మూడు అంతస్తుల వరకు ఈ ప్రింటర్ తో ఇల్లు ప్రింట్ చేసుకోవచ్చు రాబోయే కాలంలో మరిన్ని అంతస్తులు నిర్మించే ప్రింటర్ ని తయారు చేస్తారట ఏపిస్ కోర్ కంపనీ వారు…ఏదీ ఎమైనా పెరుగుతున్న సాంకేతిక వలన మనం మన పాత సామెతలన్ని మార్చుకోవాల్సి వస్తుందేమో?

(Visited 198 times, 1 visits today)