Home / Inspiring Stories / ఒంటి చేత్తో 48 మంది పాక్ సైనికులను మట్టుపెట్టిన పోరాటయోదుడు.

ఒంటి చేత్తో 48 మంది పాక్ సైనికులను మట్టుపెట్టిన పోరాటయోదుడు.

Author:

పుట్టుక నీది-చావు నీది కానీ, బ్రతుకంతా దేశానికి అన్నట్లు, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసమే పోరాడి ప్రాణాలను పణంగా పెట్టిన అసలుసిసలు భారత సైనికుడు డిజేంద్రకు ఈ వాఖ్యం సరిగ్గా సరిపోతుంది. రాజస్థాన్ లోని జాలారా గ్రామంలో పుట్టిన డిజేంద్ర కుమార్ చిన్నప్పటి నుండే దేశ సేవ చేయాలని ఉవ్విళ్లూరేవాడు. అదే లక్ష్యంతో ఇండియన్ ఆర్మీలో చేరాడు. చూడటానికి ఆరు అడుగులకు పైగా ఎత్తు, ఉక్కులా ఉండే దేహం. ఇతనిని తన తోటి స్నేహితులు అందరూ కోబ్రా అనే వారట..! ఆ తర్వాత ఇతను దేశంలోని అత్యున్నత స్థాయి కమాండోలలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.

Digendra Kumar kargil hero
1999 మే 5న అయిదుగురు భారత సైనికులను బంధించి, వారిని చిత్ర హింసలు పెట్టి చంపారు పాక్ సైనికులు. అక్కడి నుండి మొదలైన పోరాటం చివరకు కార్గిల్ వార్ తో ముగిసింది. ఈ వార్ లో ఇండియా విజయం సాధించింది. అందులో డిజేంద్ర కూడా పాల్గొన్నాడు, అతను చూపిన తెగువ అంతా ఇంతా కాదు. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సిన పోరాడటంలో డిజేంద్ర కుమార్ ఎప్పుడూ ముందే ఉండేవాడు. పాకిస్థాన్ ఆక్రమించిన 15000 అడుగుల ఎత్తులో ఉన్న ద్రాస్ సెక్టారులోని 4590 పాయింటును తిరిగి స్వాదీనం చేసుకునే భాద్యతను డిజేంద్ర పనిచేస్తున్న రాజపుటాన రైఫిల్సుకు అప్పగించారు.
Indian army dijendra in war
అయితే ఇక్కడ మొదట పాకిస్థాన్ దే పైచెయ్యి అయ్యింది, ఈలోపు శ్రీనగర్ లోని మరొక ఆపరేషన్ ముగించుకుని వచ్చిన డిజేంద్ర ఆ బెటాలియన్ కు నాయకత్వం వహించారు. తను ఒక్కడే Light Machine Gunతో పాకిస్థాన్ సైనికులను అడ్డుకుని, మరొక దారిలో మన సైనికులను ఆ ప్రాంతానికి చేరేల చేసి, కేవలం రెండు రోజులలో 4590 పాయింటును ఆక్రమించాడు. తన ఒళ్ళంతా బుల్లెట్ గాయాలతో రక్తస్రావమవుతున్నప్పటికీ, ఒంటి చేత్తో 48 మంది పాకిస్థాన్ సైనికులను చంపి జూన్ 13, 1999 రోజున 4590 పాయింటులో మన మువ్వన్నెల జెండా ఎగుర వేసి జాతీయ గౌరవాన్ని నిలబెట్టాడు.
అతని అత్యున్నత స్థాయి పొరాటానికి గుర్తుగా అప్పటి వాజ్ పాయ్ ప్రభుత్వం డిజేంద్ర సింగ్ ను‪ మహవీర చక్ర‬ అవార్దుతో గౌరవించింది. ఇదంతా ఇపుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే…? దేశం కోసం రక్తం చిందించిన వారి గురించి తెలుసుకోవటం మన కనీస భాద్యత.
 
(Visited 1,415 times, 1 visits today)