Home / Inspiring Stories / 37 ఏళ్ళ IPS సర్వీస్ లో సంపాదించింది 3 గదుల ఇల్లు, 2 ఎకరాల పొలం మాత్రమే..!

37 ఏళ్ళ IPS సర్వీస్ లో సంపాదించింది 3 గదుల ఇల్లు, 2 ఎకరాల పొలం మాత్రమే..!

Author:

అసలు ప్రభుత్వ ఉద్యోగం అంటే అవినీతి ముఖ్యంగా పోలీస్ ఉద్యోగం అంటే అవినీతికి కేర్ అఫ్ అడ్రస్ అని అంటుంటారు, అలాంటి డిపార్టుమెంటులో 37 ఏళ్లుగా ఐపీఎస్ గా ఉంటూ కేవలం 3 లక్షలు విలువ చేసే 2 ఎకరాల భూమి, లక్నోలో మూడు గదుల ఇల్లు మాత్రమే సంపాదించాడు అంటే ఎవరైనా నమ్మగలరా..? కానిస్టేబుల్లు, హోమ్ గార్డ్ లు కూడా విచ్చలవిడిగా సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఒక ఒక డీజీపీ కథ ఇదంటే నమ్మగలరా..? కానీ నిజమే… ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సుల్ఖాన్ సింగ్… అంతే… తనకి ప్రభుత్వం ఇచ్చే జీతం తప్ప మరేదీ తీసుకోడు… డై హార్డ్ నిజాయితీపరుడు… అసలు ఈరోజుల్లో అలాంటివాళ్లు కూడా ఉంటారా అని విస్తుపోయేంత నిరాడంబరుడు…!

Sulkhan Singh IPS సుల్ఖాన్ సింగ్

ఇలా సర్వీస్ మొత్తం నిజాయితీగా ఉండటం అంటే మాములు విషయం కాదు, పైగా నేరాలకు, అక్రమాలకు కేంద్రం అయిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో, తన 37 ఏళ్ళ సర్వీస్ లో ఒక్కసారి కూడా అక్రమాలకి పాల్పడకుండా నిజాయితీగా ఉన్న సుల్ఖాన్ సింగ్ వ్యక్తిత్వాన్ని, గుండె ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే, ఇలాంటి నిజాయితీ ఆఫీసర్ ని గుర్తించి డీజీపీగా నియమించిన యోగి ఆదిత్యనాథ్ కూడా మెచ్చుకోవలసిందే..!

సుల్ఖాన్ సింగ్ Sulkhan Singh IPS

1980 కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సుల్ఖాన్ సింగ్… 2007లో ములాయంసింగ్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ పోలీసు రిక్రూట్‌మెంట్ స్కాం బయటపెట్టాడు గానీ లేకపోతే ఎప్పుడో డీజీపీ అయ్యేవాడు… ఆ తరువాత మొత్తం నామమాత్రపు పోస్టుల్లోనే వేశారని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా… అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2012లో ఈ సుల్కాన్ సింగ్‌కన్నా ఎనిమిది మెట్లు కింద ఉన్న జావీద్ అహ్మద్‌ను డీజీపీగా వేశారు… అప్పుడు అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్న ఈ సుల్ఖాన్ సింగ్ ను తీసుకుపోయి ఓ డీఐజీ ర్యాంకు అధికారిని నియమించే ఓ పోలీసు ట్రెయినింగు కాలేజీలో పడేశారు… ఇక కెరీర్ అక్కడే ముగిసిపోయినట్టే అనుకున్న స్థితిలో బీజేపీ అధికారంలోకి రావడం, ఆయన్ని డీజీపీగా ఎంపిక చేయడం ఓ పెద్ద మలుపు… ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు కదూ… ఈయన పదవీకాలం డిసెంబర్ వరకూ ఉంది…. శెభాష్… శెభాష్… సుల్ఖాన్ సింగ్ … శెల్యూట్..!

(Visited 1,422 times, 1 visits today)