Home / health / చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాల గురుంచి తెలుసుకోండి.

చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాల గురుంచి తెలుసుకోండి.

Author:

రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చాలా మంది పనివాళ్ళకి ఇవ్వడమో లేదా చెత్తలో వేయడమో చేస్తారు కానీ పొద్దున ఆ అన్నాన్ని తినడానికి ఆసక్తి చూపారు, మనం అలా తినకుండా వదిలేసే చద్దన్నంలో మన శరీరానికి ఉపయోగపడే చాలా రకాల పదార్థాలు ఉంటాయని పరిశోధనలో తెలిసింది, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి, మన తాతల కాలంలో అయితే రాత్రి మిగిలిపోయిన అన్నంలో పెరుగుని కలుపుకొని తినేవారు అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.

అన్నం పులవడం(ఒక రాత్రి ఉంచడం) వల్ల దానిలో చాలా రకాల మార్పులు జరుగుతాయి, ఉదాహరణకు 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.

రాత్రి వండిన అన్నం(చద్దన్నం ) ఉదయం తినడం వల్ల కలిగే ఉపయోగాలు:

  • శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
  • శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
  • ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే తినాల్సిందే.
  • పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుంది.
  • పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
  • మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.

చద్దన్నంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి కాబట్టే “పెద్దల మాట చద్దన్నం మూట” అని అంటారు, ఇక నుండి మీరు కూడా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చెత్తలో వేయకుండా పొద్దున తినేయండి.

Must Read: సహజంగా పొట్టని తగ్గించుకోవడానికి సులువైన చిట్కా..!

(Visited 28,683 times, 1 visits today)