Home / health / తెలుగు రాష్ట్రాలని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ…! జాగ్రత్తపడండి.

తెలుగు రాష్ట్రాలని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ…! జాగ్రత్తపడండి.

Author:

స్వైన్ ఫ్లూ వ్యాధి ఎప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ప్రతిరోజూ ఈ వ్యాధి బారినపడి చాలామంది మంచానపడుతున్నారు. దీంతో చాలామంది ప్రజలు కాస్త జ్వరం, జలుబు వచ్చినా అవి స్వైన్ ఫ్లూ లక్షణాలేమోనని తీవ్రంగా ఆందోళన చెందుతూ, ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ అధికంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నాగర్ కర్నూలుకు చెందిన లక్ష్మయ్య (31) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. జనవరి నెలలో 5 గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనితో వ్యాధిగ్రస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 11 మంది చికిత్స పొందుతున్నారు. చలి తీవ్రత అధికం కావడంతో వ్యాధి తీవ్రంగా విస్తరిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వెంటనే వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

swine flu symptoms

వ్యాధి లక్షణాలు:
ఆయాస పడటం లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవటం, జ్వరం అనేవి సాధారణ స్వైన్ ఫ్లూ లక్షణాలు. వీటితోపాటు కొంతమందికి ఒళ్లు నొప్పులు, ముక్కు కారటం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు.. లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వేగంగా శ్వాస తీసుకోవటం, నీరు తాగటంలో లేదా ఆహారం మింగటంలో ఇబ్బంది ఏర్పడటం, జ్వరం, తీవ్రంగా దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్ ఫ్లూగా గుర్తించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించి, తగిన వైద్యాన్ని అందించాల్సి ఉంటుంది.

(Visited 1,116 times, 1 visits today)