Home / Inspiring Stories / ఇక ఆ రైలు ఆగిపోతుంది….ఆమె ఙ్ఞాపకాల్లో మాత్రం ఉండిపోతుంది.

ఇక ఆ రైలు ఆగిపోతుంది….ఆమె ఙ్ఞాపకాల్లో మాత్రం ఉండిపోతుంది.

Author:

జపాన్ ప్రపంచ పటంలో ఒక మూలన అతి చిన్నగా కనిపించే దేశం.రెండో ప్రపంచ యుద్దకాలంలోనూ,సునామీ సమయంలోనూ ఎక్కువగా నష్టపోయినదెశమే కానీ ఆ రెండు విపత్తులనూ తట్టుకొని ఇప్పటికీ ప్రపంచం లోని అతిపెద్ద దేశాల సరసన చేరింది. ఆ దేశం తన పౌరుల పట్లా,ఆ దేశ పౌరులు తమ ప్రభుత్వాల పట్లా ఉండే ఒక బాధ్యతాయుత భావమే ఇప్పటికీ ఆ చిన్న ద్వీపాన్ని అంత ఎత్తులో నిలబెడుతున్నాయి…

japan train2

జపాన్ తన దేశ పౌరుల కోసం ఎందుకంత తాపత్రయ పడుతుందో,దేశ అభివృద్దిని అణుమాత్రమైనా తగ్గనివ్వకూడదని ఆ దేశ ప్రజలు ఎందుకు ఆరాట పడతారో ఈ ఒక్క సంఘటన ద్వారా చెప్పొచ్చు… జపాన్ లోని కామి-షిరాతకి అనే ప్రాంతాల మధ్య ఓ రైల్వే స్టేషన్ ఉంది.రోజూ పొద్దునా సాయంత్రమూ ఒక రైలు ఈ రెండు ప్రాంతాల గుండా తిరుగుతుంది.

japantrain4

ఐతే ఈ రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతం జపాన్ లోని ఓ మారుమూల ప్రాంతం. జనం ఎక్కువగా రైలు సర్వీసు వినియోగించుకోకపోవడం.. సరకు రవాణా కూడా ఆగిపోవడంతో నష్టాల రైలు నడపటమెందుకని అనిపించింది జపనీస్ రైల్వే అధికరులకి దాంతో ఈ స్టేషన్ ను ఎత్తివేయాలని రైల్వే అధికారులు భావించారు.రైలు సర్వీసును నిలిపివేసి ఆ స్టేషన్ ని ఎత్తేయటానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. కానీ చివరి నిమిషం లో మళ్ళీ రైలును నడపాలని నిర్ణయించుకున్నారు. రైల్వే అధికారులు.

japantrain3

ఎందుకంటే రోజు హైస్కూల్ కు వెళుతున్న ఒకే ఒక విధ్యార్థిని ఆ ట్రైన్ మీదే ఆధారపడి ఉంది. తను స్కూల్ కి వెళ్ళాలి అంటే ఆ ట్రైన్ తప్ప ఆమెకు మరో మార్గం లేదు.ఆమె కోసమే ఆ ట్రైన్ ని నడపాలని అధికారుల నిర్ణయించారు. ఐతే ఆ అమ్మాయి ఏ వీఐపీ కూతురూ కాదు ఆమె తండ్రి పెద్ద బిజినెస్ టైకూన్ కాదు. ఆమె కేవలం ఒక సామాన్యుడి కూతురు. తన చదువు కోసం రోజూ కొన్ని కిలోమీటర్లు వెళ్ళటానికి మరో రవాణా మార్గాన్ని వాడుకోవటానికి కూడా వీలుకాక,ఆ ట్రైన్ మీదనే ఆధారపడ్డ ఒక మామూలు బాలిక. జపాన్ ప్రభుత్వం అక్షరాస్యత విషయంలో ఎంత అంకిత భావంతో ఉంటుందో “స్త్రీ విధ్య విషయం” లో ఆ అంకిత భావం రెట్టింపవుతుంది. అందుకే ఆ ట్రైన్ ఆగలేదు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే దాకా ఆమె కోసం ఆ ట్రైన్ ని నడిపిచాలని అనుకున్నారు. ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరువాతనే ఆ స్టేషన్ ను తీసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నెల 26 తో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటూంది. ఇక ఆ రైలూ స్టేషనూ రెండూ ఆగిపోనున్నాయి. ఒకే ఒక్క విధ్యార్థిని కోసం ఒక రైలునే కొన్ని సంవత్సరాల పాటు నడిపిన జపాన్ ప్రభుత్వ నిర్ణయం ఎంతైనా అభినందించదగ్గదే….

Must Read: సింహం బోనులోకి దూకినా బ్రతికి బయటపడ్డాడు.

(Visited 6,180 times, 1 visits today)