Home / health / ఒక్క కంద గడ్డ వంద మందులకు సమానమని ఎందుకంటారో తెలుసా?

ఒక్క కంద గడ్డ వంద మందులకు సమానమని ఎందుకంటారో తెలుసా?

Author:

అడవులలో తిరిగే మునులు “కందమూలాలు” తిని బతికేవారని పురాణాలు మనకు తెలుపుతున్నాయి. మనం నిత్యం వాడే దుంప కూరగాయల్లో కంద లేదా కంద గడ్డలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. స్వీట్ పొటాటోగా పిలవబడే ఈ కందని కొంత మంది నీటిలో, ఇంకొంతమంది నూనెలో ఉడకబెట్టుకుని తింటారు. అయితే ఈ పౌషకాహార కందని పరిమితంగా కాకుండా రోజువారీ ఆహారంగా మార్చుకుంటే ఆరోగ్యం మన అరిచేతుల్లో ఉన్నట్టే అంటున్నారు పరిశోధకులు. రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో ఈ కంద గురించి అనేక విలువైన విషయాలు తేలాయి. మరి ఆ వివరాలెంటో, కంద మూలాలేంటో తెలుసుకుందామా ?

benefits of kandagadda

కంద ఒక అద్భుతమైన, బలమైన ఆహారం అని ఇప్పటికే చాలా అధ్యయనాల్లొ రుజువైనది. దీనిలో విటమిన్ ఏ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అంతే కాకుండా కందలో ఉండే పొటాషియం, ఫైబర్, నాచురల్ షుగర్స్ మనకు చాలా తక్కువ కాలరీస్ తోనే ఎక్కువ బలం లభించేలా చేస్తాయి. కంద చంటి పిల్లల నుండి పెద్దవాళ్లకు వరకు అందరికి మేలు చేస్తుంది. ఇక గర్భిణులకు చేసే మేలు అంతా ఇంతా కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగ నిరోధకతని ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే , ఒక చిన్న కంద వంద మందులకు సమానం.

కందలను తీసుకోవడం వలన జీర్ణశక్తి వేగమవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా అధికమవుతుంది. కాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాకుండా ప్రోస్టేట్ కాన్సర్ నివారణకు కంద ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చిన్న కంద గడ్డ ద్వారా మన శరీరానికి దాదాపు 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది. వీటిని తినడం వలన ఒబేసిటీ, సుగర్ వ్యాదుల భారిన పడకుండా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ..మీ ఆహరం లో కందని చేర్చుకోండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

(Visited 2,060 times, 1 visits today)