Home / Entertainment / మళ్ళీ తన పెన్నుకు పని చెపుతున్న కోన వెంకట్.

మళ్ళీ తన పెన్నుకు పని చెపుతున్న కోన వెంకట్.

Author:

Kona Venkat

కోన వెంకట్ ఈ పేరు ఒక్కప్పుడు ఏ పెద్ద హీరో సినిమా వచ్చిన దానికి కథనో లేద, స్క్రీన్ ప్లే లేద చివరికి డైలగ్స్ అన్న రాసేవాడు.ఢీ విజయంతో స్టార్ రైటర్ గా మారి పెద్ద హీరోలందరి చిత్రాలకు పనిచేసిన కోన వెంకట్ ఈ మధ్యన సైలెంట్ అయ్యారు. కానీ కాలం ఎప్పుడు ఒక్క తీరుగా ఉందడు కద! మనోడు కథలు ఇచ్చిన, స్క్రీన్ ప్లే డైలగ్స్ రాసిన వరుస సినిమాలు ఆయన చిత్రాలు సౌఖ్యం, బ్రూస్ లీ, డిక్టేటర్, శంకరాభరణం భాక్సాఫిస్ దగ్గర బొల్త కొట్టదంతో మనోడి పని అయిపోయింది అనుకున్నారు. ఎందుకంతే మనోడు రాసే కథలల్లో కథ కంటే కామెడీ ఎక్కువ ఉంటుంది, ఆ కామెడీ అయిన సినిమా సినిమాకు మారుతుంద అంటే అది ఉందదు. చూసి చూసి ప్రేక్షకూలకు బోరుకొట్టింది ఆ పిచ్చి కామెడీ అనుకో…. కోన వెంకట్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేవాదు, తన సినిమాలు వరుసగా డమల్ అనడంతో ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు.

చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయన తిరిగి రంగం లోకి దిగారు. తాను కొత్త చిత్రం కమిటయ్యానంటూ ట్వీట్ చేసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్నాడు. గీతాంజలి తరహా హర్రర్ కథతో ఈ చిత్రం రెడీ అవుతోందని తెలియచేసాడు. అయితే కథ తనది కాదని, కేవలం డైలాగు రైటర్ ని మాత్రమే అని చెప్పారు. ఆయన ఇంకేం అన్నారో ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మ్యాటర్ పై ఓ లుక్కేసి తెలుసుకోండి.

“దర్శకుడు విజయ్ చాలా ప్రతిభావంతుడు.ఆయనే ఈ చిత్రానికి కథ కూడా రాశారు. ఈ కథపై నాకు చాలా నమ్మకం ఉంది. శివ తుర్లపాటి ప్రారంభించిన ‘బ్లూ సర్కిల్ కార్పొరేషన్’తో కలసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాం. ఈ సినిమాను సమర్పిస్తూ, తెలుగు డైలాగ్స్ రాస్తున్నందుకు గర్విస్తున్నా” అన్నారు. మీకు గనక ‘గీతాంజలి’ సినిమా నచ్చితే, అంతకు పదింతలు ఈ సినిమా మీకు నచ్చుతుంది, త్వరలో టైటిల్ మిగతా డిటేల్స్ తో మీ ముందుకు వస్తాను” అని పేర్కొన్నారు.

తమిళంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో తమన్నాతో పాటు ప్రభుదేవా, సప్తగిరి, సోనూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రచయిత కోన వెంకట్ కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి కథ కూడా ఆయనే తయారు చేసారు. బ్లూ సర్కిల్ కార్పొరేషన్ బేనర్లో శివ తూర్లపాటి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో పాటు హిందీలో కూడా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంవివి సినిమాస్ వారు సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

(Visited 102 times, 1 visits today)