Home / Entertainment / కోనా కి శ్రీనూ కీ మధ్యలో ఏం జరుగుతోంది.

కోనా కి శ్రీనూ కీ మధ్యలో ఏం జరుగుతోంది.

Author:

Srinu Vaitla And Kona Venkat Issue

కోనా వెంకట్ శ్రీనువైట్ల తీరుపై అసంతృప్తితో ఉన్నారు… శ్రీను వైట్ల పై 10లక్షల నష్ట పరిహారం కోసం తన స్టోరీనీ సినిమాలో వాడలేదంటు పరువు నష్టం దావా వేయనున్నారు, బహిరంగ క్షమాపణ చెప్పాలని పిటిషన్‌లో కోరనున్నారు.. అంటూ వచ్చిన వార్తలన్నీ ఉత్తుత్తివే అంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదానికి తెర దించాడు కోనా వెంకట్. అవన్నీ గాలి వార్తలేననీ. అలాంటి వ్యాఖ్యలని నమ్మొద్దు అనీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. తాను ఇచ్చిన ఒరిజినల్ స్టోరీ వాడకుండా, మార్పులు చేర్పులు చేసి ఇపుడు ఆ స్టోరీ తనదే తనను బ్లేమ్ చేస్తున్నారని కోన వెంకట్ అన్నట్లు వార్తలు వచ్చాయి. రైటర్ గా తన పేరు చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న శ్రీను వైట్ల నుండి పబ్లిక్ గా అపాలజీ కోరుతూ రూ. 10 కోట్ల డిఫామేషన్ సూట్ వేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలన్నీ కోన వెంకట్ ఖండించారు… మీడియాలో వస్తున్నవి అన్నీ ఫేక్ న్యూస్ అని అసలు ‘బ్రూస్ లీ ’ మంచి హిట్ సినిమా నే అని అంటున్నారు..ఇప్పటికే కమర్షియల్ గా మంచి కలెక్షన్లు సాధింస్తుందని అలాంటపుడు పరాజయం పాలైందని ఎందుకంటారని అంటున్నారు కోనా…

ఇటీవల బ్రూస్‌ లీ సినిమా విడుదల తర్వాత వైట్లతో తన సంబంధాలు వెంటలేటర్‌పై ఉన్నాయంటు ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు కోన వెంకట్‌. అంతే కాదు ఒక ఆంగ్ల దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దావా విశయం చెప్పి మళ్ళీ సాయంత్రానికల్లా ఆ వార్తని ఉప సమ్హరించుకున్నారట కోనా వెంకట్. ఇప్పటికే ఇంట్లో సమస్యలతో ఇబ్బందిపడుతున్న శ్రీనువైట్ల కి కోనా విసయం లో కాస్త తెరిపి దొరికినట్టే గానీ.. వీరి గొడవల రచ్చతో సినీ అభిమానులు మాత్రం అయోమయానికి గురవుతున్నారు…

(Visited 30 times, 1 visits today)