Home / Entertainment / ‘జనతా గ్యారేజ్’లో మొదలైన మ్యూజిక్.

‘జనతా గ్యారేజ్’లో మొదలైన మ్యూజిక్.

Author:

Devi Sri Prasad and Koratala Siva 1

రచయితగా తన కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా తన తొలి చిత్రం ‘మిర్చి’ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రైటర్ కమ్ డైరెక్టర్ కొరటాల శివ. ఆ తర్వాత శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. తన తదుపరి మూడవ సినిమాగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ‘జనత గ్యారేజ్’ చేస్తూన్నాడు. ఈ సినిమా కోసం ఎన్.టి.ఆర్ తన లుక్ ని మార్చుకునే పనిలో ఉన్నాడు. ఎన్.టి.ఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు, ఈ సినిమాని శ్రీమంతుడు సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు.

Devi sri prasad and koratala siva 2

ఇటీవలే ఫిబ్రవరి 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారు, అందులో భాగంగానే భారీ బడ్జెట్ తో ఓ సెట్ ని కూడా నిర్మిచారు. ఇప్పటికే అన్ని ప్రీ ప్రొడక్షన్ పనులను, నటీనటులను ఫైనలైజ్ చేసిన కొరటాల శివ జనతా గ్యారేజ్ మ్యూజిక్ సిట్టింగ్స్ ని మొదలు పెట్టారు. నిన్నటి నుంచి దేవీశ్రీ ప్రసాద్ – కొరటాల శివ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటూ ఈ సినిమాకి కావాల్సిన పర్ఫెక్ట్ ట్యూన్స్ ని కంపోజ్ చేసుకునే పనిలో ఉన్నారు. మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఉన్ని ముకుందన్ కనిపించనున్నాడు.

(Visited 107 times, 1 visits today)