Home / Entertainment / ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ పోస్టర్ విడుదల.

‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ పోస్టర్ విడుదల.

Author:

Krishna Gadi Veera Prema Gadha Movie First Look Released

‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్ కొట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాని.. ప్రస్తుతం ‘జై బాలయ్య’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సురభి, నివేదిత థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు.. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘జై బాలయ్య’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి మరో కొత్త టైటిల్ ఈ సినిమాకు ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం మనకు తెలిసిందే.

అయితే కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుల చేశారు. ఈ పోస్టర్ వెనుకటి రోజుల్లో క్రిష్ణ సినిమాలకు ఎలాంటి స్టైల్స్ లో పేరు డిజెన్ చేసేవారో అలానే చేశారు. చూడటానికి భలే ఉంది. ఈ సినిమాలో నాని బాలకృష్ణకు ఫ్యాన్ గా నటిస్తున్నడు. స్టోరీ ప్రకారం.. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ప్రేమకథ కావడంతో.. ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ అనే టైటిల్ బాగుంటుందని భావించి చివరికి ఇదే టైటిల్ ని ఫిక్స్ చేశారు.. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆడియోని జనవరి 10న రిలీజ్ చేసి, సినిమాని ఫిబ్రవరి 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

(Visited 104 times, 1 visits today)